కిట్స్ వరంగల్ ఎన్ఎస్ఎస్ క్లబ్ సాక్ విద్యార్థుల 7 రోజుల ప్రత్యేక శిబిరం

 


*కిట్స్ వరంగల్ ఎన్ఎస్ఎస్ క్లబ్ సాక్ 

విద్యార్థులు నిర్వహించిన 7 రోజుల ప్రత్యేక శిబిరం - పర్యావరణం, సమాజ సేవ*

వరంగల్, డిసెంబర్ 19: కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్ వరంగల్)  స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్) ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ క్లబ్ ఏడు రోజుల ప్రత్యేక శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ శిబిరం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి ఆధ్వర్యంలో, విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన మరియు సామాజిక బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించబడింది. 


ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి ప్రొఫెసర్ ఈసం నారాయణ,  కాకతీయ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ లాంచనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం. శ్రీలత, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్, శ్రీ ఎం. నరసింహారావు, అసోసియేట్ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్, డాక్టర్ చి. సతీష్ చంద్ర, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, మరియు ఇతర ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.

 శిబిరం సందర్బంగా గునిపర్తి గ్రామం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెట్ల నాటివ్వడం జరిగింది. ముఖ్య అతిథి  ప్రొ ఈసం నారాయణ మాట్లాడుతు చెట్ల పెంపకం పర్యావరణ సమస్యలను ఎదుర్కొవడంలో కీలకమని మరియు విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.


ఈ సంధర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతు టీమ్ విజయాన్ని అభినందిస్తూ, "ఈ కార్యక్రమం పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, మా విద్యార్థులలో బాధ్యతగల ప్రవర్తనను నూరిపోస్తుంది. ఇది సమగ్ర విద్యకు అనువైన అంశం," అని కూడా అన్నారు.


గునిపర్తి గ్రామ ఆలయ కమిటీ చైర్మన్  రాజేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ సారంగపాణి విద్యార్థుల కృషిని అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి తమ మద్దతును ప్రకటించారు. శిబిరంలో స్వచ్ఛ భారత్ డ్రైవ్, అవగాహన కార్యక్రమాలు, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ శిభిరం నిర్వహణ కారణంగా కళాశాల  సమాజం మధ్య బంధాన్ని బలోపేతం చేసిందని తెలిపారు.


డాక్టర్ ఇంద్రసేన రెడ్డి, లైబ్రేరియన్, మరియు డాక్టర్ డి ప్రభాకరా చారి, అసోసియేట్ ప్రొఫెసర్, గుజ్జునూరి మనోహర్, ఎన్ఎస్ఎస్ విద్యార్థి నాయకుడి నాయకత్వంలో ఎన్ఎస్ఎస్ టీమ్ కృషిని ప్రశంసించారు. వారు పర్యావరణం మరియు సామాజిక కారణాల పట్ల విద్యార్థుల అంకితభావాన్ని మెచ్చుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు