ఆనతినీయరా ప్రభూ

 


*_ఆనతినీయరా ప్రభూ..!_*

#################

_మధురగాయని_ 

_వాణీ జయరాం_

_జయంతి 30.11.1945_

_సందర్భంగా_

_అక్షరహారతి_


"************"***********


*విధి చేయు వింతలన్నీ*

*మతి లేని చేతలేనని..*

*విరహాన వేగిపోయి*

*విలపించే కథలు ఎన్నో..*


కొన్ని ప్రత్యేకమైన గీతాలను

సుమధురగళంతో

ఆలపించి మైమరపించిన

కోయిలమ్మ వాణి..!


*నేనా పాడనా పాటా..*

*మీరా అన్నదీ మాట..*

ఆ గొంతులో ఎంత బిడియం

సిగ్గు పడుతూనే 

మొగ్గలు పూయించింది..

తెరలు తెరలుగా

సురను కురిపించింది..!


పేరులోనే వాణిని పొదుగుకున్న మధురవాణి..

స్వరరాణి..సుమధుర బాణి..

*_మాధుర్యానికి_* 

*_తన స్వరమే వాకిలై.._*

_*భువికి దిగివచ్చిన ఎలకోయిలై..*_

*_వదనం భూపాలమై.._*

*_హృదయం ధృవతాళమై.._*

*_సహనం సాహిత్యమై.._*

*_పాడిందే సంగీతమై.._*

ఆ సంగీతమే 

తన ఇంగితమై..అవగతమై

మనోహర గీతమై..

గొప్ప గతమై..!


పతి మాట దాటని సతి..

జయరాముడే 

*_ఆనతినీయగా.._*

*_సమ్మతినీయగా_* 

*_సన్నుతి చేయగా.._*

_ఉడకని అన్నానికి_

_ఆయనకొచ్చే అను'రాగానికి'_

_ఏ రాగం బాగుండునో_

_చెప్పే త్యాగయ్య ఆయనేగా!_

అలా..అలలా..

కలలా..పాటల వలలా

మిగిలిపోయింది ఎప్పటికీ

వాణీజయరాముగా..

పాడుతూ గోముగా..!


భక్తి గీతాలు..

ప్రేమ పాటలు..

కృతులు..జతులు..

సంగతులు...

అన్ని ప్రక్రియలూ

క్రమం తప్పక...

సంక్రమం చేయక..

*_సంగీతమే భాషగా.._*

*_గుండె ఘోషగా_*

పదివేల గీతాలను

ఆలపించిన మధురగాయని

_పరుపులు పరచిన_ _ఇసుకతిన్నెలకు.._

_పాటలు పాడిన_ 

_సందె గాలులకు.._

_దీవెన జల్లులు_ 

_జల్లిన అలలకు.._

_కోటి దండాలంటూ.._

*_ఆనతి నీయమని_*

*_హరుని వేడుతూ.._*

*_నీ ఆన లేనిదే_* *_గ్రహింపజాలున_*

*_వేదాల వాణితో_* *_విశ్వనాటకం.._*

*_నీ సైగ కానిదే జగాన సాగునా_*

*_అయోగమాయ_*

..అని వేడుతూ

మధుర తంత్రులను మీటింది..

*_ఆనతినీయరా అచలనాట_*

*_అర్చింతునంటూ.._*

వెళ్ళిపోయింది

గంధర్వలోకానికి..

అక్కడి నుంచే 

వచ్చింది గనక..

లేక కినుక...

ఇలకు మిగిల్చి 

*దశసహస్ర గీతాల కానుక..!*


🎼🎼🎼🎼🎼🎼🎼


*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

       9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు