క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో 64 మంది కిట్స్ విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఫాక్స్‌కాన్
ఫాక్స్‌కాన్ కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు గా ఎంపికయిన 64 మంది కిట్స్ వరంగల్ విద్యార్థులు
కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో పూల్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ ద్వారా హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫాక్స్‌కాన్ లో 64 మంది కిట్స్ వరంగల్ విద్యార్థులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు గా ఎంపిక అయ్యారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి వెల్లడించారు.
*సాంకేతిక దిగ్గజ యమ్. యన్. సి. కంపెనీలు రాబోయే రోజుల లో కిట్స్ ప్రాంగణ నియామకాల నిర్వహణకు సంసిద్ధం*
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫాక్స్‌కాన్, కిట్స్ వరంగల్ నుండి పూల్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 64 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుంది.
ఫాక్స్‌కాన్ హైదరాబాద్‌లోని ఫెసిలిటీలో $500 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి MNCలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ల ద్వారా కిట్స్
ఇ న్‌స్టిట్యూట్ నుండి ప్రతిభావంతులైన వారిని నియమించుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ ఆధారిత ప్రాసెస్ ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ వంటి సరికొత్త సాంకేతిక రంగాలలో శిక్షణ పొందుతున్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి యమ్. యన్. సి లలో జి ఈ, హెయిర్, చబ్ ఇండియా, కాగ్నిజెంట్, మొదలగు వాటి తో పాటు ప్రముఖ ఐ టి కంపెనీ లు ప్రాంగణ నియామకాలు చేపట్ట డానికి సిద్ధంగా ఉన్నాయి. రాబోయే ఈ డ్రైవ్‌లలో విద్యార్థులు తమ సీనియర్లను అనుకరిస్తు నైన్యాభి వృద్ధిని నిరంతర ప్రక్రియ గా చేసుకోవాలని ప్రిన్సిపాల్ అశోకా రెడ్డి సూచించారు.
ఈ సందర్భంగా కిట్స్ కళాశాల యాజమాన్యం సభ్యులు, రాజ్యసభ, మాజీ సభ్యులు కిట్స్ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంతా రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి , హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వి. సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి, డీన్ ట్రైనింగ్ & ప్లేస్ మెంట్స్ ప్రొఫెసర్ వై. పురందర్, టి.పి.ఓ. డా. టి. చంద్రబాయి, కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ ఇ. కిరణ్ కుమార్, వివిధ విభాగాల డీన్స్, విభాగాదిపతులు మరియు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, & పి ఆర్ ఓ. డా.డి. ప్రభాకరా చారి, పలువురు బోధన, బోధనేతర సిబ్బంది ఎంపిక అయిన విధ్యార్ధుల కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box