జీవన్ రెడ్డికి బొద్దిరెడ్డి హెచ్చరిక



టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పై బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించిన కాంగ్రేస్ పార్టీ నేత బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

 ఏఐసిసి సభ్యులు,టిపిసిసి సెక్రటరీ 

బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి


బిఆర్‌యస్‌ అధికారం కోల్పోయి  ఆపార్టీ నిజామాబాద్  జిల్లా అధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పై మతిలేని చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని నిరాధారణమైన ఆరోపణలు చేయడం మంచిదికాదని బట్టకాల్చి మీద వేసే పద్దతులు మానుకోవాలని 

ఏఐసిసి సభ్యులు,టిపిసిసి సెక్రటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి  హెచ్చరించారు.

మంచి మనుసున్న మహారాజులాంటి వారు,సౌమ్యుడిగా, నీతి  నిజాయితీకి నిభద్దతకు నిలువెత్తు అద్దంలాంటి వారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు. వారి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని మేము గత 40 సంవత్సరాల నుండి కలసి మెలసి పార్టీలో పనిచేసిన వారం కాబట్టి వారి క్రమశిక్షణ, కాంగ్రేస్‌ పార్టీ అభివ్రుద్ది కోసం,ప్రజల పక్షాణ వారి పోరాట పనితీరు గురించి మాకు తెలుసు అని కార్యకర్తలకు అండగా ఉంటూ ఎదిగిన కొద్ది ఒదగమని పద్దతిలో పనిచేసే అధ్యక్షుడని బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కొనియాడారు.


మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ లో ఒక యన్‌యస్‌యుఐ విధ్యార్థిగా సామాన్య కార్యకర్త స్థాయి నుండి పనిచేసి అంచలంచలుగా ఎదిగిన యువ నాయకుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌  బడుగు బలహీన వర్గానికి చెందిన అతను టిపిసిసి అధ్యక్షుడిగా నిజామాబాద్ నుండి ఎదిగితే ఓర్వలేక జలసితో అక్కస్సుతో బలుపుతో పూర్తి నిరాధారణమైన ఆరోపణలు చేయడం మంచిది కాదని అన్నారు. 


టిపిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ పై పసలేని నిరాదార ఆరోపణల ద్వారా వారి అధి నాయకుని ద్రుష్టిలో పడాలనే తాపత్రయంతో ఆరోపణలు చేయడం జీవన్ రెడ్డికి పరిపాటి గా మారింది. కెసిఆర్ కు కాపలా కుక్కలా ఉంటూ బాంచన్‌గిరి చేస్తూ, అలాగే బిఆర్‌స్‌ కళక్కకు అటెండర్‌గా సర్వ స్వపర్యాలు చేస్తూ సిగ్గులేని నీచ రాజకీయ నాయకుడిగా భూకబ్జదారుడిగా నిజామాబాద్ లో సుపరిచితుడు అని ఆయన చేసిన నిరాధారణమైన ఆరోపణలు పట్టించుకోనవసరం లేదన్నారు. బలహీనవర్గ గౌడ సామాజిక వర్గం నుండి అంచలంచెలుగా తెలంగాణ లో ఎదిగి  టిపిసిసి అధ్యక్షుడి హోదాలో ఉంటే చూసి ఓర్వలేక నిరాధారణమైన ఆరోపణలు జీవన్‌రెడ్డి చేస్తే మాలాంటి కరడుగట్టిన కాంగ్రేస్‌ వారలము చూస్తూ ఊరుకోమని అన్నారు.  


టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పై మరోసారి ఎవరైన నోరు జారితే తగిన గుణపాఠం తప్పదని బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు