త్వరలో యాదగిరి గుట్ట టెంపుల్ బోర్డు -సీఎం రేవంత్ రెడ్డి

 


యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో ముగిసిన ముఖ్యమంత్రి సమీక్ష.


యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు స్పష్టం చేసిన సీఎం.


టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్న సీఎం


టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.


టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్న సీఎం.


గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి.


గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్న సీఎం.


గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం ఉండదని గుర్తుచేసిన సీఎం.


కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం.


విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్న సీఎం.


బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్న సీఎం.


ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలన్న సీఎం.


అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం


ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం.


మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్ తో రావాలని అదేశించిన సీఎం.


ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం.


పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి  రిపోర్ట్ అందించాలని తేల్చి చెప్పిన సీఎం.


ఇకనుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించిన సీఎం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు