*_'యమగోల'కు_*
*_నలభై ఏడేళ్ళు..!_*
21.10.1977
+++++++++++++++++
_ఓలమ్మి తిక్కరేగిందా.._
_ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా.._
చూసిన జనాలకి
*తిక్క..తిమ్మిరి*
ఎక్కించిన సినిమా
వ్యంగ్యాస్త్రాల
సుడిగాలి..*_యమగోల..!_*
*_నరసరాజు నవరసరాజై.._*
నీరసం ఎరుగక
సరసం..విరసం..
ప్రతి పలుకు పాదరసం..
ఎడాపెడా రాసేస్తే
*యముండ..*
తిప్పేస్తే మీసం..
ఇదిగో *యమగోల*
మరోసారి మీ కోసం!
సినిమాలో సగం కలే..
ఆ కలలో అదిరిపోయే
*రామారావు కళ..*
థియేటర్లలో జనం కళకళ..
*_సమరానికి నేడే ఆరంభం_*
*_యమరాజుకు మూడెను_*
*_ప్రారబ్ధం_*..బద్దలైన యమర్జన్సీ నాటి నిశ్శబ్దం..!
వయసుతో పోటీ పడుతూ
అదరగొట్టిన ఎన్టీఆర్..
*_నరసరాజు అస్త్రాలు.._*
తగినట్టు పలకడం
నటరత్న ఎప్పుడో
*_ఔపోసన పట్టిన శాస్త్రాలు.._*
సంజయుడికి తప్పని చురకలు..బెంబేలెత్తిన
నాటి పాలకులు..!
యముండ..
ఒక్క మాటతో అదరగొట్టిన
కైకాల..అదే యమగోల..
ఆధునిక యముడిపై
ఛాయాదేవి మోహం..
ఆ చాయపై
సిహెచ్ గుప్తా వ్యామోహం..
సమవర్తి ట్రంకు పెట్టెపై
రావు గోపాలరావు ఆశ..
అన్నసత్రాలు ఎలా దిగజారిపోయాయో..
అల్లు ఘోష..
ప్యాంటు కోటు తొడిగి
ప్రాచీన భాష..
గద తాకట్టు పెట్టి
కట్టిన భోజనం బిల్లు..
శుభ్రంగా కలుపుకుని
పారవేసిన స్ట్రా..
ప్రతి సన్నివేశంలో
నవ్వులు ఎగస్ట్రా..!
_బెజవాడ ఎళ్ళాను.._
_గుంటూరు పొయ్యాను.._
జయమాలినితో
రామలింగడి దబ్బిడి దిబ్బిడి
గోపాలరావు సెట్టింగు..
యముండ అంటూ
సత్తెన్న ఫిటింగు..
_ఆడవె అందాల సురభామిని_
_పాడవె కళలన్ని ఒకటేనని..._
స్వర్గంలో అప్సరసల ఆటపాటలున్నా
నరకమే బెటరన్న అన్న..
_వయసు ముసురుకొస్తున్నది_
_వానమబ్బులా.._
సొగసైన జయప్రదతో
ఎన్టీఆర్ _చిలక్కొట్టుడు_
చక్రవర్తి సంగీతం చితక్కొట్టుడు..
తాతినేని రామారావు
దర్శకత్వ పటిమే
అసలైన బ్యాక్ గ్రౌండు!
______________________
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box