సోమశిల టూ శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం

 


సోమశిల టూ శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం

         పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త అందించింది.. నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్ లో చేపట్టనున్న ఈ టూర్ అక్టోబర్ 26 వ తేదీ నుండి  నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి  తెచ్చింది.. కొల్హాపూర్ మండలం సోమశిల తీరంలో 120మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు ఏర్పాటు చేశారు.

     కృష్ణా నదిలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు (120 కిలోమీటర్లు) 7 గంటల పాటు లాంచీ ప్రయాణం ఉంటుంది. ఈ లాంచీ ప్రయాణానికి పెద్దలకు 2 వేల రూపాయలు, పిల్లలకు 1,600 రూపాయల టికెట్‌ ధర నిర్ణయించినట్లు సోమశిల లాంచీ ఇన్‌ఛార్జి  తెలిపారు.

     ఇది కేవలం జ‌ర్నీకి సంబంధించిన రుసుము మాత్రమే. శ్రీశైలంలో రూమ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ వంటికి ఎవరికి వారే భరించాల్సి ఉంటుంది. నాగార్జునసాగర్‌ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడిపిస్తారు.  వివరాలకు హైదరాబాద్‌ అధికారుల సెల్‌నంబర్‌ 9848540371, 98481258720, నాగార్జునసాగర్‌ అధికారుల నంబర్‌ 7997951023కు సంప్రదించవచ్చు..  (Dt. 27 . 10. 2024)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు