యూట్యూబ్ ఛానల్స్ - అక్రెడిటేషన్లు ‘’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం



‘’యూట్యూబ్ ఛానల్స్ - అక్రెడిటేషన్లు  ‘’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం.


రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వడానికి విధివిధానాలు, అనుసరించాల్సిన నియమ నిబంధనలు సూచించడానికి , యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు, తదితర అంశాలపై చర్చించడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెప్టెంబర్ 23న నిర్వహిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్,  కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.


‘’యూట్యూబ్ ఛానల్స్- అక్రెడిటేషన్లు ’’ అంశంపై మీడియా అకాడమీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని సెప్టెంబర్ 23న, బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ లో నిర్వహిస్తుంది. ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు, నీష్ణాతులు ఈ సమావేశంలో పాల్గొని సంబంధిత విషయాలపై చర్చించి, జర్నలిస్టులకు  అక్రెడిటేషన్లు ఇవ్వడానికి సూచనలు చేస్తారని అకాడమీ  చైర్మన్ చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు