వామ్మో వీళ్ళు కిరాతక తల్లీ కూతుళ్లు

 


హత్యలంటే వీరికి పెద్దలెక్కకాదు - కూల్ గా కూల్డ్రింక్లో   సైనేడ్ ప్రయోగించడం మద్యంలో కలిపి తాగించి చంపడం వీరికి వెన్నతో పెట్టిన విద్య   

అప్పులు తీసుకొని, ఆపై సైనైడ్ ప్రయోగం మూడేళ్లలో నాలుగు హత్యలు   గుట్టు తేల్చిన గుంటూరు పోలీసులు 

గుంటూరు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషప్రయోగంతో హత్యలు చేస్తున్న ఓ తల్లికూతుర్ల హంతక ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు. పలు దినపత్రికల్లో వచ్చిన ఈవార్తకథనం చదివిన వారు వీళ్ళు మనుషులేనా అని అసహ్యించుకుంటున్నారు.  

 అమాయకపు మాటలతో తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకొని, తిరిగి చెల్లించకుండా వారి ప్రాణాలు తీస్తున్న హంతక ముఠా గుట్టును రట్టు చేశారు గుంటూరు పోలీసులు. నింది తుల్లో ఇద్దరు తల్లీకుమార్తె కాగా, వారికి ఇద్దరు మహి ళలు తోడై ఈ దారుణాలకు తెగబడ్డారు. వివరాలను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ విలేకర్లకు వివరించారు. తెనాలి లింగయ్యకాల నీకి చెందిన మడియాల వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి (32) సీఏ కోర్సు మధ్యలో ఆపేసింది. కొన్నాళ్లు వాలం టీర్ గా పనిచేసింది. కంబోడియా వెళ్లి, అక్కడివాళ్లతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడింది. అనారోగ్యానికి గురై తిరిగి తెనాలి చేరుకున్న ఆమె.. భర్తను వదిలేసి, తల్లి గొంతు రమణమ్మతో కలిసి ఉంటోంది. జల్సాలకు అల వాటు పడిన తల్లీకుమార్తెలు డబ్బు కోసం ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని చంపేశారు. మరో ముగ్గురు మహిళల హత్యకు ప్రణాళిక వేయగా, బెడిసి కొట్టింది. రెండు హత్యల్లో వీరితోపాటు తెనాలికి చెందిన రజిని, భూదేవి పాల్గొన్నారు.

వెంకటేశ్వరి రమణమ్మ తెలిసిన వారిపై నమ్మించి ఘాతుకం

ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మేనత్త సుబ్బలక్ష్మి ఆస్తి రాసివ్వడం లేదంటూ 2022లో తల్లి రమణమ్మతో కలిసి వెంకటేశ్వరి ఆమెకు మద్యంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేసింది.

ఆ బాకీ చెల్లించాలని అడుగుతోందని 2023 ఆగస్టులో తెనాలికి చెందిన వృద్ధురాలు నాగమ్మకు శీతల పానీ యంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేశారు.

2024 ఏప్రిల్లో తెనాలికి చెందిన పీసు అలియాస్ మోషే తరచూ తన భార్య భూదేవిని వేధిస్తుండేవాడు. అతన్ని చంపేస్తే బీమా నగదు వస్తుందని భూదేవి, రమణమ్మ కలిసి మోషేకు మద్యంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేశారు.

ఈ ఏడాది జూన్లో వెంకటేశ్వరి తెనాలికి చెందిన రజినితో కలిసి నాగూరీ అనే మహిళను హత్యచేశారు. ఆమెకు బీజర్లో సైనైడ్ కలిపి తాగించారు.

జ తెనాలికి చెందిన వాలంటీర్ అన్నపూర్ణ, వర మీరాబీలపై హత్యాప్రయత్నం చేశారు.

కేసు ఎలా ఛేదించారంటే?

ఈ ఏడాది జూన్ 5న చేబ్రోలు మండలం వడ్లమూడి శివారు నిర్మానుష్య ప్రాంతంలో మహిళ మృతదేహం పడి ఉండటంపై అప్పటి ఎస్సై మహేశ్ కుమార్ అను మానాస్పద మృతిగా కేసు పెట్టారు. ప్రస్తుత ఎస్సై వెంక కృష్ణ దర్యాప్తు చేపట్టారు. మృతురాలు తెనాలి యడ్ల లింగయ్య కాలనీకి చెందిన నాగూర్బీగా గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన రజిని.. నాగూబ్బీ వద్ద అప్పు తీసు కొంది. తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న నాగూర్బీని చంపాలని రజిని భావించింది. ఈ విషయాన్ని వెంకటే శ్వరితో పంచుకోవడంతో అంతా కలిసి పథకం వేశారు. నాగూర్బీని నమ్మించి ఆటోలో వడ్లమూడి వైపు తీసుకెళ్లి, సైనైడ్ కలిపిన బ్రీజర్ను తాగించి చంపేశారు. పోలీ

సులు సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించి రజిని, నాగూరీ వెళ్లిన ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ను విచారించారు. రజినీని అదుపులోకి తీసుకొని' కూపీ లాగగా, నాగూరీ హత్యోదంతంతో పాటు తల్లీకుమా ర్తెలు చేస్తున్న సీరియల్ హత్యల దారుణం బయటప డింది. నిందితుల్లో రమణమ్మ, వెంకటేశ్వరి, రజినీలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. భర్తను చంపిం చిన మరో నిందితురాలు భూదేవి, సైనైడ్ సరఫరా చేసిన తెనాలికి చెందిన కృష్ణపై కేసు నమోదుచేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు