సరైన దారి..ఈ సర్దార్..



 *_సరైన దారి.._*

*_ఈ సర్దార్..!_*


_మన్మోహన్ సింగ్ పుట్టినరోజు_


*_(సురేష్..9948546286)_*


✍️✍️✍️✍️✍️✍️✍️✍️


జీవితంలో ఎంత కూడబెట్టాడో

తెలియదు కాని..

ఆయన జీవితం మొత్తం లెక్కలే..

లెక్కలంటే

రెండ్రెళ్లు నాలుగు..

రెండు మూళ్ళు ఆరు..

లెక్కలు కాదు..

అక్కడితో సరిపోట్టుకుంటే

ఆయన మన్మోహన్ సింగ్

ఎందుకవుతారు..

ఆయన ఆయన 

ఆర్థిక మంత్రిత్వంలో 

దేశం అంతగా ఎందుకు

స్వింగ్ అవుతుంది..!


ఆర్థిక శాస్త్రంలో చదువు..

అదే అస్త్రంగా కొలువు..

పాగా పెట్టిన బుర్ర నిండా

లెక్కల బరువు..

భారత ఉన్నతికి కల్పతరువు 

మన సింగు..నిజాయితీ కింగు!


రాజకీయం ఆయన

వృత్తీ కాదు.. ప్రవృత్తీ కాదు..

నిజానికి అది ఆయనకు చేదు..

అలాగని మిన్నకుంటే

ఊరుకుంటాడా 

అపర చాణక్యుడు పివి..

ఏరి కోరి తన కొలువులో

అప్పగిస్తే ఆర్థిక శాఖ..

సంస్కరణల మాయాజాలం..

మన్మోహనుడి సమ్మోహనాస్త్రం..

ఆనాడు మన ప్రగతి చూసి 

నివ్వెరపోయింది ఆర్థికశాస్త్రం!


తిమ్మిని బమ్మిని చెయ్యలేదు

బ్రహ్మాండం మాత్రం 

బద్దలు చేసేసాడు..సింగు..

సంపద సృష్టి..

ఉపాధి కుంభవృష్టి..

మన ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి..

నరసింహుడికి ఇష్టకామేష్టి..

మన్మోహనుడికి దిష్టి..

సోనియా హయాంలో

ప్రధానమంత్రి అయి

దిష్టిబొమ్మగా నైవేద్యం నష్టి..!


ఆర్థిక మంత్రిగా 

అద్భుతాలు చేసిన

ఈ మనిషి...

ప్రధానిగా అయిపోయాడు 

మట్టిమనిషి..

స్వేచ్చలేక..

అసలు మాటాడే 

వీలులేక అయ్యాడు 

అమ్మ చేతిలో బొమ్మ..

రాహులేమో పప్పు..

ఈయనేమో డప్పు..!

ఆ దశలోనే 

కాంగ్రెస్ పరాజయం

నివురు గప్పిన నిప్పు..

చేస్తూ తప్పు మీద తప్పు..!!


ఏది ఎలా ఉన్నా

ఉన్నత విలువల

సర్దార్ జీ..

భారత రాజకీయాల్లో

సదా గౌరవప్రదమైన సర్ జీ..!


🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు