ముంబయి: పిల్లల నుండిపెద్దల వరకు అందరికి ప్రీతి పాత్రుడు. గణపతి నవరాత్రులు వచ్చాయంటే చాలు గణేషుడిని రకరాకల అలంకరణలతో తీరొక్క రూపాలతో తయారుచేసి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. హిందువులు ఎక్కడ ఉంటే అక్కడ వినాయక చవితి (Vinayaka Chavith) ఉత్సవాలు జరుపు కుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలునిర్వహిస్తారు. దివి నుంచి దిగివచ్చే బొజ్జ గణపయ్య కోసం ఊరూరా, వాడవాడలా అందమైన మండపాలను ఏర్పాటు చేసి ఆటపాటలతో ఆరాధిస్తారు. వివిధ రూపాల్లో లంబోదరుడి ప్రతిమలతో ప్రతి వీధి కళకళలాడుతుంది.
ఈ క్రమంలోనే వినాయక వేడుకల్లో ఏటా ప్రత్యేకంగా నిలుస్తున్న ముంబయిలోని ప్రముఖ జీఎన్బీ సేవా మండల్ (GSB Seva Mandal) 'మహాగణపతి' ఈసారీ వార్తల్లో నిలిచింది. దేశంలోనే సంపన్న వినాయకుడి (Richest Ganpati)గా పేరొందిన ఈ విఘ్నేశ్వరుడి వేడుకలకు ఈ ఏడాది ఏకంగా రూ.400 కోట్లతో బీమా చేయించారు. ఎందుకంటే ఇక్కడి విగ్రహాన్ని భారీఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించారు. ముంబయి (Mumbai) శివారులోని మతుంగా ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జీఎస్బీ సేవామండల్ వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈసారి 70వ వార్షికోత్సవం జరుపుకొంటోంది. ఈసందర్భంగా సమ్ ధింగ్ స్పెషల్ గా ఈ ఏడుఉండాలని మండపంలోని గణపయ్య విగ్రహాన్ని ఏకంగా 66 కిలోల బంగారం, 325 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. దీంతో ముందుజాగ్రత్తగా ఈ వేడుకలకు రూ.400. 58 కోట్లతో బీమా చేయించినట్లు నిర్వాహకులు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. నేటినుంచి సెప్టెంబరు 11 వరకు ఐదు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
గతేడాది సైతం ఈ గణేశ్ మండపానికి రూ.360.40 కోట్లకు బీమా తీసుకున్నారు. భక్తులు, నిర్వాహకులకు ఇది వర్తిస్తుంది. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను కూడా నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఏర్పాటుచేశారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box