విద్యుత్ శాఖపై సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాబోయే రోజుల్లో తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారబోతోంది.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలి.
ఐటీ, ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి.
సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలి.
డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టండి.
వివిధ శాఖల్లో వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోండి.
రైతులకు సోలార్ పంప్ సెట్ లను ఉచితంగా అందించి వారిని సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలి.
కొండారెడ్డి పల్లెను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని అధికారులకు ఆదేశం.
సోలాట్ పంప్ సెట్ ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్ పై రైతుకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయండి.
వంటగ్యాస్ బదులుగా సోలార్ సిలిండర్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టండి.
వీటిపై మహిళా సంఘాలకు శిక్షణ అందించి వారిని సోలార్ సిలిండర్ బిజినెస్ వైపు ప్రోత్సహించాలి.
అటవీ భూముల్లోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలి.
ప్రతీ ఏటా 40వేల మెగావాట్స్ విద్యుత్ అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపట్టండి.
ప్రణాళికాబద్దంగా వ్యవహరించి దుబారాను తగ్గించాలి.
ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టండి.
ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు.
వినియోగదారులకు 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న నమ్మకం కలిగించాలి.
వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది కలగనీయొద్దు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box