బి.సి రిజర్వేషన్ల సాధనకు అన్ని జెండాలు ఏకం కావాలి
ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్
బి.సి లు రైతు తరహా ఉద్యమ చేయాలి
ఇందిరాపార్క్ దీక్షలో నినదించిన నాయకులు
గడిచిన ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజ్వేషన్లను సాధించడం కోసం వివిధ పార్టీల్లోని బి.సి లు జెండాలను పక్కకు పెట్టి ఐక్యంగా ఉద్యమించాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బి.సి ప్రజా కుల సంఘాల ఆధ్వర్యంలో బి.సి జనసభ అద్యక్షులు రాజారాం అధ్యక్షతన జరిగిన సమగ్ర కుల జనగణన, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు సాధన కోసం బి.సి. సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. గడిచిన 75 ఏండ్లుగా దోపిడీకి గురైన బి.సి లు సామాజిక, ఆర్థిక, రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాజకీయ అవకాశాలు తప్పనిసరి అని, గ్రామ స్థాయిలో రాజకీయ రంగ ప్రవేశం చేయడం ద్వారా చట్టసభల్లో కూడా బి.సి వాటా సాధించగలమని అన్నారు. చట్టాలు చేసే చట్టసభల్లో బి.సి లకు వాటా లేనంతకాలం అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ వైస్ చైర్మన్ పటేల్ వనజక్క మాట్లాడుతూ ఎన్నో త్యాగపూరిత ఉద్యమాలు చేసిన చరిత్ర కలిగిన తెలంగాణలో బి.సి హక్కుల సాధన కోసం గ్రామ స్థాయి ఉద్యమాలు చేయాలని అన్నారు. మహిళా బిల్లులో బి.సి వాటా కోసం సగ భాగమైన మహిళలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటా కోసం గల్లిలో, చట్టసభల్లో వాటా కోసం డిల్లీలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘాల కన్వీనర్ తాడిశెట్టి క్రాంతి కుమార్ మాట్లాడుతూ బి.సి లకు రాజకీయ అవకాశాలు లేకపోవడం వల్ల అన్ని రంగాల్లో వెనుకబడి పోతున్నారని అన్నారు. పల్లె నుండి పార్లమెంటు వరకు అన్ని స్థాయిల్లో బి.సి లకు రాజకీయ అవకాశాలు దక్కడం కోసం పల్లె నుండి డిల్లి దాక దేశవ్యాప్త ఉద్యమం చేయాలని అన్నారు. ఇబిసి రిజర్వేషన్ల వల్ల బి.సి లకు తీవ్ర నష్టం జరుగుతుందని, సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బి.సి లకు వాటా దక్కాలంటే రాజకీయ అధికారం తప్పనిసరని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, విశ్రాంత ఐఎఎస్ అధికారి చిరంజీవులు, బి.సి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, హిందూ బి.సి మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్దేశర్లు, విసికె పార్టీ రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్, ఆల్ ఇండియా ఒబిసి జాక్ రాష్ట్ర నాయకులు ఏటిగడ్డ అరుణ, అశోక్ పోశం, చాపర్తి కుమార్ గాడ్గే, బి.సి కమీషన్ మాజీ సభ్యులు గౌరీ శంకర్, వివిధ సంఘాల నాయకులు కె వి గౌడ్, పిడికిలి రాజు, కృష్ణ, పులి రంజిత్ గౌడ్, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, దాసోజు లలిత, నితిన్, వీరాస్వామి, బుద్దే వెంకన్న, అశోక్ యాదవ్, చెన్న మధు, కుసుమ లక్ష్మినారాయణ, నయీం, ప్రణయ్ గౌడ్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపి మాట్లాడారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box