తెలుగు విశ్వ విద్యా లయానికి సురవరం ప్రతాప రెడ్డి పేరు

 


అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి 

అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

అన్ని పార్టీలు అంగీకరిస్తే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ కతెలంగాణ వై తాళికులు సురవరం ప్రతాప రెడ్డి పేరు పెడతామని ప్రకటించారు. సీఎం ప్రకటనపై సిపిఐ శాసన సభ్యులు కూనమినేని హర్షం వ్యక్తం చేసారు. అన్ని రాజకీయ పక్షాలు ఇందుకు ఒప్పుకోవాలని విజ్ఞప్తి చేశారు.


గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని బడ్జెట్ లో రూ.321 కోట్లు కేటాయించింది.


చదువులోనే కాదు... క్రీడల్లోరాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుంది.. కుటుంబ గౌరవం పెరుగుతుంది.


ఇది నిరూపించెందుకే నిఖత్ జరీన్, సిరాజ్ కు గ్రూప్1 ఉద్యోగాలు ఇచ్చాం..


తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ తీసుకువస్తాం.


వివిధ రాష్ట్రాల పాలసీలు అధ్యయనం చేసి బెస్ట్ పాలసీని తీసుకొస్తాం.


హర్యానాలో అత్యధికంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు.


వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పోర్ట్స్ పాలసీని సభలో ప్రవేశపెడతాం..


మండల కేంద్రాల్లో భూములు అందుబాటులో ఉంటే స్టేడియం  నిర్మించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు..


బ్యాగరి కంచెలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి.


వారు కూడా సానుకూలంగా స్పందించారు.. రాబోయే కొద్దిరోజుల్లోనే ఇందుకు భూమిని కేటాయిస్తాం..


స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపుతోపాటు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళతాం.


స్పోర్ట్స్ పాలసీ కోసం ఎవరు ఏ సలహాలు ఇచ్చినా స్వీకరిస్తాం.


హైదరాబాద్ లో గతంలో నిర్మించిన స్టేడియాలు ప్రయివేట్, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యాయి.


వీటన్నింటినీ అప్ గ్రేడ్ చేసి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంచాల్సిన అవసరం ఉంది..


ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలనుకుంటుంది.. అందుకు మీ అందరి మద్దతు కోరుతున్నా..


అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు