పుంజాల శివశంకర్ స్ఫూర్తితో రిజర్వేషన్ల సాధన

 


పుంజాల శివశంకర్ స్ఫూర్తితో రిజర్వేషన్ల సాధన

95వ జయంతిలో నినదించిన నాయకులు 


    న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఎన్నో అడ్డంకులను అధిగమించి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా, గవర్నర్ గా సేవలు చేసి బి.సి వర్గాల రిజర్వేషన్లు సాధించిన బి.సి పక్షపాతి పుంజాల శివశంకర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో బి.సి లకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు సాధించాలని పలువురు బహుజన నాయకులు పిలుపునిచ్చారు. బి.సి లెజెండ్ శివశంకర్ 95 వ జయంతిని పురస్కరించుకొని హైదరబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, వైస్ చైర్మన్లు పటేల్ వనజ, ఏటిగడ్డ అరుణ, డాక్టర్ వినయ్ కుమార్, మున్నూరు కాపు సంఘం అపెక్స్ కమిటీ చైర్మన్ సర్ధార్ పుట్టం పురుషోత్తం, హిందూ బి.సి మహాసభ రాష్ట్ర అద్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు, విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ లు ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. 

     శివశంకర్ తన జీవన ప్రయాణంలో మొదట న్యాయవాదిగా తర్వాత న్యాయమూర్తిగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారని, ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా, సిక్కిం, కేరళ రాష్ట్రాల్లో గవర్నర్ సేవలు అందివ్వడమే కాకుండా క్లిష్టమైన న్యాయ సమస్యలకు పరిష్కారం అందించి ఇందిరా గాంధీకి అండగా నిలిచారని అన్నారు. పార్టీ సేవతో పాటు తన పుట్టుకను మరవకుండ బి.సి ల హక్కుల కోసం ఎంతో శ్రమ పడి మండల్‌ కమిషన్‌ రావడానికి రెండు దశాబ్దాల ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  119 బి.సి కులాలకు రిజర్వేషన్లు సాధించారన్నారు. కేంద్ర న్యాయ, విదేశీ వ్యవహారాలు, పెట్రోలియం మొదలైన శాఖల మంత్రిగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ క్యాబినెట్‌లలో నంబర్ టూ హోదాకు ఎదిగాడని, ఆయన ఒప్పించడం వల్లనే మండల్ కమిషన్ తన పనిని పూర్తి చేసి, భారతదేశం అంతటా ఒబిసి లకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించే నివేదికను అందించగలుగారని వారన్నారు.



    న్యాయవ్యవస్థలో ఆయన వేసిన సామాజిక న్యాయ పునాది వల్లే హైకోర్టు బి.సి లు న్యాయమూర్తులు కాగలిగారని, ఆయన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన కుల జనగణన, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు సాధించాలని, చట్టసభలో బి.సి వాటా కోసం దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టి విజయం సాధించాలని వారు పిలుపునిచ్చారు. 


   ఈ కార్యక్రమంలో హన్మకొండ జాక్ చైర్మన్  తాడిషెట్టి క్రాంతి కుమార్, బి.సి నాయకులు కోల జనార్ధన్ గౌడ్, వాసు కె యాదవ్, అశోక్ పోషం, కె వి గౌడ్, పిడికిలి రాజు, అవ్వారు వేణు కుమార్, జక్కాని సంజయ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు