తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడం, వ్యూహత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి Revanth Reddy రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ప్రారంభమైంది. న్యూయార్క్ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి బృందానికి ఘన స్వాగతం లభించింది. అమెరికాతోపాటు దక్షిణ కొరియాలోనూ వారు పర్యటిస్తారు. "కీలకమైన న్యూయర్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను.
ప్రవాస భారతీయులైన ఇక్కడి మన తెలుగు సోదర సోదరీమణులు గుండెల నిండా ప్రేమ, ఆప్యాయతలతో మాకు స్వాగతం పలకడానికి విచ్చేశారు. మనందరినీ ఏకం చేసే ఒక కల.. తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకోవడం" అని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
ఈ నెల తొమ్మిది వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ సమావేశమవుతారు. ఈ నెల 5న న్యూయార్క్‌లోని కాగ్నిజెంట్, ఆర్సీఎం, టిబిసి, కార్నింగ్, జోయిటస్ సహా పలు సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. 6న పెప్సికో, హెచ్సిఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తరువాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వెళతారు.
న్యూయార్క్ నగరం నుంచి మొదలైన ఈ పెట్టుబడుల సాధన పర్యటనలో రాబోయే 10 రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియాలోని వివిధ నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి నాయకత్వంలోని బృందంలో పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జాయిన్ అవుతారు.

0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box