రాధ(నీలో) మరణంపై పోలీసులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించండి-ప్రకటన విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

 


భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ

శతృవుకు కోవర్టుగా మారి విప్లవ ద్రోహానికి పాల్పడిన బంటి రాధ(నీలో) మరణంపై పోలీసులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించండి!


రాధ మరణానికి పోలీసులే బాధ్యత వహించాలని నిలదీయండి!!


ప్రియమైన ప్రజలారా, కుటుంబ, బంధుమిత్రులారా!

పార్టీనీ, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి పోలీసులు బంటి రాధను విప్లవ ద్రోహిగా మార్చి కోవర్టు కుట్రలో భాగం చేసి ఆమె మరణానికి కారకులయ్యారు. చివరకు బంటి రాధే తాను చేసిన ద్రోహానికి మరణశిక్ష విధించడం సరైందని మనస్ఫూర్తిగా అంగీకరించింది. 'పోలీసుల కుట్రలో నాలా ఎవరూ ద్రోహిగా మారకూడదని' విప్లవ శ్రేణులకు విజ్ఞప్తి చేసింది. పోలీసులు రాధ ద్వారా పన్నిన భారీ దాడి పథకాన్ని విఫలం చేయడంతోపాటు అందులో ముఖ్యులైన కొందరు ద్రోహులకు అనివార్య స్థితిలోనే భౌతిక శిక్షలు విధించాం. పై విషయాలపై ఏ.ఓ. బీ ఎస్.జడ్.సీ వివరంగా పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ వాస్తవాలపై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి ప్రకటనలు చేయకుండా సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నాలకు పూనుకున్నారు. అందుకు ఆమె కులాన్నీ, జండర్న ఉపయోగించుకొని అవాస్తవాలతో కూడిన నీచమైన ప్రచారానికి పూనుకున్నారు. అందుకు పోలీసులే కొన్ని సంఘాల పేర్లతో పోస్టర్లు, ప్రకటనలు, పాటలు విడుదల చేసారు. సమస్యను ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలపైకి ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం దళిత, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలకూ, హత్యలకు పాల్పడే పోలీసులకు రాధ కులం, జెండర్ విషయాలను మాట్లాడే నైతిక అర్హత లేదు. ప్రస్తుత వర్గసమాజాన్ని రద్దు చేసి ఒక మనిషి మరొక మనిషిని దోచుకోవడానికి వీలులేని వర్గరహిత సమాజాన్ని నిర్మించాలనే అత్యున్నత లక్ష్యంతో పార్టీలో చేరి విప్లవోద్యమంలో భాగమయ్యే ఎవరైనా తమ కులం, జెండర్, వర్గ, అస్థిత్వాన్ని రద్దు చేసుకుంటారనేది వాస్తవం. కానీ పోలీసులు, వర్గ శతృవులు, కొందరు ముర్ఖులు ప్రతిసారి కులాన్ని ముందుపెట్టి దాన్ని ఆయుధంగా వాడుకొని పార్టీపై దుష్ప్రచారం చేయడం ఎప్పటినుండో చేస్తున్నదే. ఇప్పుడు కూడా అవే అసత్యాలను ప్రచారం చేస్తున్నారు.


బంటి రాధ సమాజంలో పీడిత వర్గ మహిళగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నది. వాటికి పరిష్కారంగా విప్లవ రాజకీయాలను మనస్ఫూర్తిగా స్వీకరించి స్వచ్ఛందంగా పార్టీలో చేరింది. పార్టీ ఆమెకు విప్లవ సిద్ధాంతాన్నీ, రాజకీయాలనూ, సరైన విప్లవపంథాను బోధించి వర్గపోరాట ఆచరణలోకి దింపింది. సాధారణ సభ్యురాలు స్థాయి నుండి అనతికాలంలోనే నాయకత్వ స్థానంలోకి ఎదిగింది. దీని వెనకా ఆమె పట్టుదల, పార్టీ చేసిన కృషి ఉంది. అదే సమయంలో విప్లవానికి ఆటంకంగా ఉండే పెరీబూర్జువా భావాలను పార్టీ సరిదిద్దే ప్రయత్నం చేసింది. కానీ తనను తాను విప్లవ లక్ష్యానికనుగుణంగా తీర్చి మలుచుకోవడంలో పార్టీ అందించిన ఎడ్యుకేషన్ను స్వీకరించి తప్పుడు భావాలను సరిదిద్దుకోలేకపోయింది. ఫలితంగా క్రమంగా రాజకీయ పథనంవైపు అడుగులు వేసింది. ఈ సమయంలోనే తన కుటుంబ బలహీనతలు పోలీసులు వాడుకొని విప్లవద్రోహిగా మార్చి తను నమ్మిన రాజకీయాలకూ, పీడితవర్గానికి నష్టం చేసే విధంగా దిగజార్చారు. ఆమె బలహీనతలను వాడుకొని పార్టీ నాయకత్వాన్ని నిర్మూలించాలని చూసారు. కానీ పార్టీ అప్రమత్తం అవడం వల్ల తమ పథకం విఫలం కావడంతో తేలుకుట్టిన దొంగల్లా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు, విప్లవాభిమానులలో గందరగోళాన్నీ, అపోహల్ని, అనుమానాలను రేకెత్తించడానికి పడరానిపాట్లు పడుతున్నారు. పోలీసులు ఈ కుటిల ఎత్తుగడల్ని తిప్పికొట్టి వాస్తవాలను అర్థం చేసుకోవాలని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాం.


కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పై వాస్తవాలను గ్రహించి రాధ మరణానికి కారణమైన పోలీసులను నిలదీయాలి. నేడు పార్టీపై 'కగార్' పేరుతో కొనసాగుతున్న నిర్మూలన యుద్ధంలో దాన్ని ప్రతిఘటిస్తూ ఓడించడానికీ, విప్లవోద్యమాన్ని పురోగమింపజేయడానికి ప్రజలు, పార్టీ అనన్య త్యాగాలు చేస్తున్నారు. పోలీసుల చుట్టివేత వలయాలలో కూడా రాధ శవాన్ని కుటుంబ సభ్యులకు అందజేసే మా వంతు బాధ్యతను నెరవేర్చడానకే తెలంగాణ సరిహద్దుల్లోని జనసంచార ప్రాంతంలో తన శవాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది మా బాధ్యతగానే చేసామనేది కుటుంబ సభ్యులు గమనించాలని కోరుతున్నాం. వీలుంటే మరిన్ని వాస్తవాలను కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. పోలీసుల మోసకారి మాటల్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.


గణేష్ 

కార్యదర్శి,

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు