బి.సి హక్కుల కోసం బి.సి న్యాయవాదులు ముందుండాలి
కరీంనగర్ బార్ లో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఐ ఎల్ పి ఎ నాయకులు
బి.సి హక్కుల సాధన కోసం చట్టం, న్యాయం, రాజ్యాంగం తెలిసిన బి.సి న్యాయవాదులు ముందుండాలని ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు సాంసన్ అన్నారు. బి.సి హక్కుల సాధన ఉద్యమంలో బి.సి న్యాయవాదులను భాగస్వాములను చేయడం కోసం ఈ నెల 25 న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి బి.సి న్యాయవాదుల సదస్సును పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కరీంనగర్ బార్ అసోసియేషన్ లో సీనియర్ న్యాయవాది కట్ట రమేష్ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా 60 శాతం పైగా జనాభా కలిగిన బి.సి ప్రజలను ఇంకా మనుషులుగా గుర్తించడం లేదని, జనగణన కోసం 70 ఏండ్లుగా ఎన్ని పోరాటాలు చేసినా నేటికీ బి.సి జనాభా లెక్కలు చేయడం లేదని, జనాభా లెక్కలు చేయకుండా బి.సి లకు రిజర్వేషన్లు పెంచి కోర్టులల్లో వేగిపోయేలా చేస్తున్నారని అన్నారు. బ్రిటిష్ కాలంలో జరిగిన జనగణన తర్వాత ఇప్పటికీ జనగణన జరగలేదని, కుల జనగణన కోసం, చట్టసభల్లో బి.సి వాటా కోసం కోసం దేశవ్యాప్త ఉద్యమం అవసరమని, ఆ ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించాల్సిన అవసరముందని అన్నారు.
ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో కుల జనగణన - ఒబిసి ల అభివృద్ధి, జనాభా దామాషా ప్రకారం అవకాశాలు - సామాజిక న్యాయం, మహిళా కోటాలో బి.సి మహిళా వాటా, బి.సి ఓటర్ల బానిసత్వం - పాలక వర్గాల ధోరణి అనే నాలుగు అంశాలపై ప్రముఖులైన బి.సి కమీషన్ చైర్మన్ వకులాబరణం కృష్ణ మోహన్, కర్ణాటక హై కోర్టు న్యాయవాది ఎస్ బాలన్, పూనే న్యాయవాది వాసంతి నల్వడా, ప్రొఫెసర్ సింహాద్రి, మధ్యప్రదేశ్ న్యాయవాది వినాయక్ ప్రసాద్ లాంటి వారు ఈ సదస్సులో బి.సి ల స్థితిగతులు, భవిషత్ ఉద్యమం పట్ల ప్రసంగిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కట్ట రమేష్ మాట్లాడుతూ కాకా కలెక్కర్, మండల్ కమీషన్ లాంటివి ఎన్ని నివేదికలు ఇచ్చినా , ఎన్ని పోరాటాలు చేసినా ప్రధాన రంగాలైన న్యాయ వ్యవస్థ, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో నేటికీ బి.సి లకు అన్యాయం జరుగుతుందని అన్నారు. సామాజిక న్యాయ సమరంలో న్యాయవాదులు ముందుండాలని, బి.సి సమాజం ఐక్యతగా సాగి చట్టసభల్లో, న్యాయ వ్యవస్థలో వారి వాటా వారు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25 న హైదరాబాద్ లో జరుగు బి.సి న్యాయవాదుల రాష్ట్ర సదస్సును వియవంతం చేయడంలో కరీంనగర్ జిల్లా న్యాయవాదులు ముందుండాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్క్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్, జూకూరి మహేష్, కరీంనగర్ బార్ అససియేషన్ లైబ్రరీ సెక్రటరీ కటకం రాజేందర్, స్పోర్ట్స్ సెక్రటరీ రవి పటేల్, కార్యనిర్వహక సభ్యులు కొండ్ర లక్ష్మణ్, న్యాయవాదులు వాసాల నరేష్, గొంటి మధు, బొజ్జ స్వామి, రాజేష్ యాదవ్, రవీంద్ర స్వామి, మనోహర్ పటేల్, వెన్నం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box