కిట్స్ వరంగల్ కళాశాలలో ముగిసిన 24 గంటల "నాసా స్పేస్ ఆప్ హాకథాన్”
హైదరాబాద్ వారి ఫౌండర్స్ ల్యాబ్ - SUMVN,కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్ (కిట్స్ వరంగల్) సంయుక్తంగా నిర్వహించిన 24 గంటల "NASA- నాసా స్పేస్ యాప్స్ హ్యాకథాన్"లో అన్ని శాఖల విద్యార్థుల కోసం సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఐ స్క్వేర్ ఆర్ ఈ కిట్స్ వరంగల్ క్యాంపస్) విజయవంతంగా నిర్వహించారు.
120 మంది విద్యార్థులు 24 గ్రూపులుగా ఏర్పడి ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో 6 గ్రూపులు చండీగఢ్‌లోని నేషనల్ లెవల్ "నాసా స్పేస్ ఆప్ హ్యాకథాన్"కు ఎంపికయ్యాయని ప్రిన్సిపాల్ ప్రొ.కె. అశోక రెడ్డి తెలిపారు.
"నాసా స్పేస్‌కు ఎంపికైన విద్యార్థులను రాజ్య సభ మాజి సబ్యులుఎం.పి., కిట్స్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు , కోశాధికారి పి.నారాయణరెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ మాజి ఎమ్మెల్యే, కిట్స్ వరంగల్ అడిషనల్ సెక్రెటరీ, వి. సతీష్ కుమార్, ఇతర మేనేజ్‌మెంట్ సభ్యులు, ప్రిన్సిపాల్ ప్రొ.కె. అశోక రెడ్డి శుభాకాక్షలుతెలిపి అభినందించారు.
అంతరిక్ష పరిశోధనల మీద విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను మేల్కొల్పి వారిని స్పేస్ సైంటిస్టులుగా తీర్చిదిద్దేందుకు అంతరిక్ష పరిశోధన రంగంలో ఉన్న ఇన్నోవేషన్ అవకాశాల మీద అవగాహన కల్పించి, ప్రపంచ అంతరిక్ష శాస్త్ర సాంకేతిక రంగాల్లో సవాళ్లకు ఎదుర్కునేందుకు విద్యార్థుల చేత వివిధ రకాల పరిష్కారాలు కనుగొనే దిశగా కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నాసా స్పేస్ ఆప్ హాకథాన్ ప్రారంభించారు.
చంద్రయాన్-3 విజయవంతానికి గుర్తుగా యావత్ భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా వరంగల్ నగరంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ 24 గంటల నాసా స్పేస్ ఆప్ హాఖాతాన్ నిర్వహించడం ఒక మంచి పరిణామం.
ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తి చూపే విధంగా ఈ హాకథాన్ ప్రారంభించారు. ఇందులో 120 మంది విద్యార్థులు 24 గ్రూపులుగా పాల్గొని అంతరిక్ష పరిశోధనలో ఉన్న సవాళ్లు మరియు అవకాశాలకు అనుగుణంగా నైపుణ్య పరిష్కారాలను అవిష్కరించే విధంగా ప్రజెంటేషన్స్ రూపొందించారు.
ఈ కార్యక్రమం 23 ఆగస్టు ఉదయం 10 గంటలకు మొదలై మర్నాడు 24 ఆగస్టు ఉదయం 10 గంటల వరకు నిరాటంకంగా కొనసాగింది. అనంతరం కార్యక్రమంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వినూత్న సాంకేతిక అంశాల పట్ల ప్రెజెంటేషన్ మరియు సొల్యూషన్స్ రూపొందించిన వారిని విజేతలుగా ఎంపిక చేశారు.
అంతేకాకుండా ఈ విజేతలకు చండీగఢ్ యూనివర్సిటీలో జరిగే జాతీయ హాకథాన్ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించడం జరుగుతుంది. అంతరిక్ష పరిశోధనలో ఉన్న అవకాశాలను విద్యార్థులకు తెలియజేసి వారిని అత్యుత్తమ అంతరిక్ష సైంటిస్టులుగా తీర్చిదిద్దడానికి నాసా, ఇస్రో వంటి సంస్థల్లో జరుగుతున్న పరిశోధనల పట్ల కూడా అవగాహన కలగడానికి ఈ హాకథాన్ ఎంతో ఉపయోగపడుతుంది.
అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి వెబ్ అప్లికేషన్స్, గేమింగ్ , డేటా సైన్స్, సెన్సార్ టెక్నాలజీ, రోబోటిక్స్ వంటి అంశాల్లో విద్యార్థులు ఈ సందర్భంగా తమ పరిశోధనలను ప్రదర్శించడం జరిగింది.
ఈ 24 గంటల ముగింపు ఈవెంట్‌లో వివిధ విభాగాల హెడ్స్, డీన్స్, హెడ్, సెంటర్ ఫర్ ఐ స్క్వేర్ ఆర్ ఈ, ప్రొఫెసర్ డాక్టర్ కె రాజ నరేందర్ రెడ్డి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ వి రాజు రెడ్డి, హైదారాబాద్ SUMVN ఫౌండర్స్ ల్యాబ్ ప్రతినిధులు డైరెక్టర్, పెదపడెల్లి సత్య ప్రసాద్, కట్టపల్లి సాయికిరణ్, వెంకట్ మరియు ఫ్యాకల్టీ టీమ్ , 124 మంది విద్యార్థులు, వారి ప్రతి నిధులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు పి ఆర్ ఓ డాక్టర్ డి. ప్రభాకరా చారి పాల్గొని విద్యార్థి నిష్ణాతుల ను అభినందించారు.
----
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box