నకిలీ జీవో పై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు



 1109 జీవో నకిలీది. దీనిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు


ఇటీవల అవినీతి నిరోధక శాఖకు చిక్కిన రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎం..వి భూపాల్ రెడ్డి కేసును విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బదిలీ చేస్తున్నట్టు విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వులు నిజం కాదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జీవో 1109 పేరిట విడుదలైన ఈ నకిలీ జీవో పై సైబర్ క్రైమ్ లో జిఏడి అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అనుసరించి కేసు Cr.No.324/24 registered at Saifabad లో నమోదు చేశారు. ఈ నకిలీ జీవో విడుదల చేసిన వారిని త్వరలోనే గుర్తించి, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

---ends

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు