*_బాబూ..ఏంటీ డాబు..?_*
*_ఎందుకీ రుబాబు..!?_*
________________________
( _*సురేష్..జర్నలిస్ట్*_)
✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽
చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇప్పుడే మొదటిసారిగా ముఖ్యమంత్రి అవ్వలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్r ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పని చేసిన ఘనత ఆయన సొంతం. మర్రి చెన్నారెడ్డి..
కోట్ల విజయభాస్కరరెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా పదవీ కాలాలు తక్కువ.
చెన్నారెడ్డి మొదట 1978లో..తర్వాత 1989 లో రెండు దఫాలు అయిదేళ్ల కాలంలో r
మొదట సీఎంగా ఉండి
మధ్యలో మరొకరికి పదవి అప్పగించిన వ్యక్తి..ఇక కోట్ల వారు కూడా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసి రెండుసార్లు ఆయన చేత్తోనే నందమూరి తారకరామారావుకు సింహాసనం అప్పగించిన చరిత్రను సొంతం చేసుకున్న
ఢిల్లీ దిగుమతి నాయకుడు.
ఇక ఎన్టీఆర్
మొదట 1983లో..మళ్ళీ నాదెండ్ల ఎపిసోడ్ తర్వాత..చివరగా 1994 లో..
మూడుసార్లూ కలిపి ఏడున్నర
సంవత్సరాలు లేవు.మీ రాజకీయ వైఎస్ రాజశేఖరరెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొమ్మిదేళ్ళ పదవీ కాలాన్ని బ్రేక్ చేసి పదేళ్లు..ఆపై కూడా సీఎంగా కొనసాగి ఉండేవారేమో..విధి ఆయన్ని హెలికాప్టర్ ప్రమాదంలో బలి తీసుకుంది.అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు
రికార్డు పదిలం అయింది.
ఇక నవ్యాంధ్ర విషయానికి వస్తే
2014లో ఊపిరి పూసుకున్న పిల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా
చంద్రబాబు నాయుడు
మరో ఇన్నింగ్స్ మొదలు పెట్టి అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని పద్నాలుగేళ్ల
ఇండస్ట్రీ ఇక్కడ అంటూ కొత్త రికార్డును ప్రోధి చేసుకున్నారు.
ఇంతకుముందు..అంటే 2019 లో జగన్మోహనరెడ్డికి ఆంధ్ర ప్రజలు ఇచ్చిన ఘనవిజయాన్ని
బట్టి ఇక మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి రావడం కష్టం..
ఇక ఆయన ఇన్నింగ్స్ కి తెరపడిపోయినట్టే అనుకున్నారు చాలా మంది.
అయితే జగన్ సెల్ఫ్ గోల్ తో
తన వైభోగానికి తానే తెర దించుకున్నంత పని చేసారు.
మొత్తానికి చంద్రబాబు అదృష్టమో లేక సామర్థ్యమో కానివ్వండి..
జగన్ తప్పిదాలే
అవనివ్వండి..పవన్ కళ్యాణ్ చొరవే అవనివ్వండి ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.
*_ఇదీ ఫ్లాష్ బ్యాక్..!_*
ఇక వర్తమానంలోకి వస్తే..
బాబు వంటి ఘటనాఘట సమర్ధుడైన వ్యక్తి కూడా
తన పద్నాలుగేళ్ల రికార్డును మరచి..ఇప్పుడే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టు..
పోలవరం పూర్తి చేస్తా..r
రాష్ట్రంలో అవినీతి లేని పాలనను అందిస్తా..
పేదలందరికీ ఇల్లు ఇస్తా..
రాష్ట్రంలో పేదరికమే లేకుండా చేస్తా..అంటూ అబజబదబా మాటలాడుతుంటే కొంచెం విడ్డూరంగా అనిపిస్తోంది.!
పోలవరం మేటరు బాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఉంది.
పేదలు అప్పుడూ ఉన్నారు..
ఇప్పుడూ ఉన్నారు..
పాలకవర్గాలు ఇలాగే వ్యవహరిస్తుంటే ఎప్పుడూ ఉంటారు.ఇక అవినీతి గురించి..చంద్రబాబనే కాదు..ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా కర్ణకఠోరంగానే అనిపిస్తుంది.
ఆయననే కాదు..ఇంచుమించు పాలకులు అందరూ అవినీతికి పాల్పడేవారే..దానిని పెంచి పోషించే వారే..అందుకు చంద్రబాబూ మినహాయింపు కారు!
ఇప్పుడు మద్య నిషేధం విషయానికి వద్దాం..
మొన్న చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడుతూ
గత ప్రభుత్వం మద్యం విషయంలో పాల్పడిన అక్రమాల గురించి ప్రస్తావించారు.కష్టజీవి తన శ్రమను మర్చిపోడానికి కొంచెం తాగుతాడు అంటూ ఆయన మద్యపానాన్ని సమర్ధించినట్లు వ్యవహరించారు..అది వేరే సంగతి ..గత అయిదేళ్లలో సరైన నాణ్యత లేని మద్యం విక్రయించారని..
అది కూడా అధిక ధరలకు అమ్మారని వివరించారు.
ఇది సముచితం కాదని అనిపించలేదా.
ఇక్కడ కొన్ని విషయాలు ప్రస్తావించక తప్పదు.
1993 లో కోట్ల విజయభాస్కర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సారా నిషేధం విధించిన తర్వాత 94లో జరిగిన ఎన్నికల్లో
తారక రామారావు
సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎన్నికల వాగ్దానంగా హైలైట్ చేసి అఖండ విజయం సాధించారు.మాట ఇచ్చినట్లుగానే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే
సంపూర్ణ నిషేధాన్ని అమలులోకి తెచ్చారు.
అటు తర్వాత 1995 లో బాబు అధికారం చేపట్టిన తర్వాత దశల వారీగా మద్యనిషేధానికి ఎలా మంగళం పలికారో ఉమ్మడి ఆంధ్ర ప్రజానీకం మొత్తానికి తెలిసిందే.
అదో పెద్ద కథ..బాబు నిషేధాన్ని ఎత్తేసి బార్లకు గేట్లు బార్లా తెరిచారన్నది స్థూలంగా నిజం.
పోతే..2014 లో బిజెపి మిత్రపక్షంగా రాష్ట్రంలోనూ..కేంద్రంలోనూ అధికారం పంచుకున్న చంద్రబాబు
ఏ దశలోనూ ప్రత్యేక హోదా కోసం గాని..ప్యాకేజీ కోసం ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నించింది లేదు.
అంతకు ముందు రాష్ట్రంలో..కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కూడా బాబు
కర్ర విరగని..
పాము చావని రీతిలో వ్యవహరించారు.మొదట్లో 1995 తర్వాత.. మొన్న 2014 ప్రభుత్వంలో కూడా పెన్షన్ల విషయంలో కూడా బాబు
నిజాయితీగా లేరన్న సంగతి కూడా బహిరంగమే.ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా పెద్దదే..!
ఇప్పుడు మొదటి నెలలో పెన్షన్ సకాలంలో ఇచ్చి చంకలు గుద్దుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ముందు
చాలా బాధ్యతలు ఉన్నాయి.అమరావతి అభివృద్ధి ఒక్కటే ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న పెద్ద విషయం కాదు.అలాగే పోలవరం మాత్రమే లక్ష్యం కానేరదు.ఎన్నో పనులు..
ప్రజల చుట్టూ ఎన్నో ఆశలు..
ఆకాంక్షలు..ముఖ్యమంత్రి చుట్టూరా ఎన్నెన్నో ప్రతిబంధకాలు..
నిధుల లేమి..అప్పుల కొలిమి..
తాకట్లు..లక్ష్యాలు కొల్లలు..
ఇవన్నీ అధిగమిస్తూ
బాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి..!
అంతేకాదు..
కింది స్థాయిలో పార్టీ కార్యకర్తల
రెచ్చుబాటుకు కళ్లెం వేయాల్సిన బాధ్యత బాబుపై ఉంది.రాష్ట్రంలో ఎక్కడికక్కడ నాయకులు.. కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా ఇప్పటికే జనం దృష్టిలో
కూటమి ప్రభుత్వం పలచన అవుతున్న పరిస్థితి.జగన్ సర్కారుకు..
బాబు ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదనే అభిప్రాయం అప్పుడే కొన్ని వర్గాల నుంచి
వ్యక్తం కావడం మొదలైంది.
బహుపరాక్..!
ఇన్ని విషయాలు సరిచూసుకుంటూ..
సరి చేసుకుంటూ..
మరోవైపు మూడు గుర్రాల బండిని నడపడం చంద్రబాబు ఎంత ఘటికులైనా
కాస్త ఇబ్బందే..
ఏం చెయ్యనున్నారో..
ఎలా నెట్టుకు వస్తారో..
కల్కి బాబు 2029 ఎజె(after jagan)
వరకు చూస్తూనే ఉందాం..!
😞😞😞😞😞😞😞😞
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box