_అతిలోకసుందరి పుట్టినరోజు_ _____________________ *_వెన్నెల నడిచొచ్చిన వేళ..!_*

 


_అతిలోకసుందరి పుట్టినరోజు_

*_వెన్నెల నడిచొచ్చిన వేళ..!_*


*_కథగా కల్పనగా కనిపించెను_*

_*నాకొక దొరసాని..*_


*_సిరిమల్లె పూవా.._*

*_సిరిమల్లె పూవా.._*

*_చిన్నారి చిలకమ్మా.._*


*_జాము రాతిరి జాబిలమ్మ_*

*_జాగు చేయకే ఇలా.._*


*_అందాలలో అహో మహోదయం.._*

*_భూలోకమే నవోదయం.._*

*_పువ్వు నవ్వు పులకించే_*

*_గాలిలో..నింగి నేలా_*

*_చుంబించే లాలిలో.._*


సమ్మోహనంగా

దివి నుంచి దిగివచ్చిన

అతిలోకసుందరి..

ఒకనాటి నీ..నా..

కలల రాణి..

మన మొహబ్బత్ కి

తొలినాటి బోణీ..

వెండితెర పూ'బోని'..

సురుచిర సుందర వాణి..!


శ్రీదేవి..పూలతావి..

ముద్దులొలికే 

అందమైన మోవి..

*_బూచాడమ్మా బూచాడు.._*

_*బుల్లి పెట్టెలో ఉన్నాడు..*_

ఆనాటి బడిపంతులు మనుమరాలు..

_*బంగినపల్లి మామిడి పండు*_

_*రంగుమీదుంది..చిలకే కొట్టని*_

*_జాంపండు సిగ్గుపడుతోంది.._*

నిన్నటి జాబిల్లి 

వేటగాడి ప్రియురాలు..

అదే ముద్దుల మోము..

శ్రీదేవి రెండు తరాల 

హీరోలకి గారాము!


అంతటి ఎన్టీఆరే 

_*1980 వరకు ఇట్టాంటి*_ 

_*ఓ పిల్ల నా కంట పడలేదు..*_

_*పడినా నే వెంట పడలేదు..*_

అని మురిసిపోలేదా బంగారక్కని..శ్రింగారక్కని

చూసి..మురిసి..!


*_తారలు దిగివచ్చిన వేళ.._*

*_వెన్నెల నడిచొచ్చిన వేళ_*

అక్కినేని చేసేసాడు *ప్రేమాభిషేకం..!*


టాలీవుడ్డుని జాలీగా చుట్టేసి

బాలీవుడ్డులో  హిట్టుల

'బోనీ' కొట్టి..


కోలీవుడ్డులో 

కోకిలమ్మలా కూసి..

ఆపై ముంబై చేరిన

*_చాందినీ.._*

ఊపేసిన *_నగీనా..!_*


_అమ్మ బ్రహ్మదేవుడో_

_కొంప ముంచినావురో.._

_పూలరెక్కలు.._

_కొన్ని తేనె చుక్కలు_

_రంగరిస్తివో.._

_ఇలా బొమ్మ చేస్తివో.._

_అసలు భూలోకం_

_ఇలాంటి సిరి చూసి ఉంటదా!_


అలాంటి అందాల సుందరి..

ఇంద్రకుమారి..

ముంబైకి వెళ్లిపోతేనే బెంగెట్టుకున్న 

నాటి కుర్రాళ్ళు..

అక్కడ బోనీని చేసుకుందేంట్రా అని కలవరపడిపోతే..

బంగారక్క మరణం 

మరీ విషాదం..

నీళ్ళ తొట్టెలో శవమై పడి ఉంటే గింజుకుపోయింది

ప్రతి హృదయం..

మరచిపోలేక 

ఆమె అభినయం..!


*_కనురెప్పలు పడ్డప్పుడు_*

*_కల కళ్ళపడదుగా_*

*_కనుకిప్పుడు ఎదరున్నది_*

*_కలైపోదుగా_*


ఇంద్రకుమారైనా ఇంత అందంగుంటదా..

హీరోయినంటే

అంత సొగసు ఉట్టిపడతదా..

అందమే *శ్రీదేవి* గా పుట్టిందా..

అభినయమే అలా సొగసులద్దుకుని 

వెండితెరపై వెలుగులు

విరజిమ్మిందా..

*_క్షణక్షణం_* లో అమాయక బ్యాంకు పాప..

*_ఆఖరిపోరాటం_* ప్రవల్లిక..

ఒక కల..*వసంతకోకిల..*

*_ఓ ఎర్ర గులాబీ విరిసింది_*

*_తొలిసారి నినుకోరి..._*

*_స్వర్గం వెలిసింది భువిలో.._*


*_శ్రీదేవి.._*

_ఒక కల..ఒక కళ..._

_ఒక వల..ఒక వెన్నెల.._

_ఒక మెరుపు..ఒక విరుపు.._

_భారతీయ చలనచిత్ర యవనికపై_

_మెరిసిన మరీచిక..!_


*_శ్రీదేవి_*

_అద్భుతలోకం నుంచి జారిపడ్డ ఇంద్రజ.._

_ఆల నీలి గగనంలో_

_వెన్నెలలా మెరిసి.._

_తారగా తళుక్కుమని.._

_లక్ష్మీదేవి స్వహస్తాలతో_

_రాసి ఇచ్చిన పత్రం.._

_ఎప్పటికీ మనతోనే ఉండిపోయే చైత్రం.._

_చిత్రం..ఆమె ప్రతి చిత్రం..!_


*_శ్రీదేవి_*

_వలపు వసంతం..._

_అందం ఆమె సొంతం.._

_*అరుదుగా ఉద్భవించే*_ 

_*ఓ అద్భుతం..!*_


💐💐💐💐💐💐💐


*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

       9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు