మొదలైన రైతుల రుణ మాఫి నిధుల విడుదల - సచివాలయంలో నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

                                


                   ఆనందంలో ముఖ్యమంత్రి - మంత్రి వర్గ సహచరులు

                              రాష్ట్రవ్యాప్తంగా రైతుల సంబరాలు 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు రైతుల రుణ మాఫి కార్యాకరమంలో భాగంగా మొదటి విడతగా నిధులు విడుదల చేసారు. హై దరాబాద్ రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన  రైతు రుణమాఫీ  నిధుల విడుదల కార్యక్రమంలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  ఇతర మంత్రివర్గ సహచరులతో కల్సి  పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఈ సందర్భంగా ఒకరి నొకరు అభనందించుకుని ఆనందం పంచుకున్నారు.

కాంగ్రేస్ మాట ఇస్తే శిలా శాసనం- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి



రైతుల కిచ్చిన  హామి మేరకు మాట నిలబెట్టుకున్నామని కాం గ్రెస్ పార్టి  మాట ఇస్తే శిలా శాసనమని మరోసారి నిరూపణ అయిందని  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అన్నారు.

గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికి ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చారని ముఖ్యమంత్రి అనందం వ్యక్తం చేశారు.

మంత్రివర్గ సహచరులు, అధికారుల సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామ్ననారు.

నాడు కరీంనగర్ లో సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసని మాట ఇచ్చి ఇచ్చిన మాట తప్పకుండా తెలంగాణ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని గుర్తు చేసారు. 

పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసినా  మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చారన్నారు.

తెలంగాణ ప్రజలు శాశ్వతంగా సోనియా గాంధీని మరిచిపోలేని విదంగా  రాష్ట్రాన్ని  ఇచ్చారన్నారు.

గత పాలకులు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు సార్లు మాట తప్పారని విమర్శించారు.

మొదటి ఐదేళ్లలో కేసీఆర్ 16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి   12 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. 



రెండో సారి ప్రభుత్వంలో 12 వేల కోట్లు మాఫి చేస్తామని చెప్పి కేవలం 9 వేల కోట్లు మాత్రమే చెల్లించారన్నారు.

పదేళ్లలో 21 వేల కోట్ల రూపాయలు కూడా రుణమాఫీకి కేసీఆర్ చెల్లించలేదన్నారు. 

రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కేసీఆర్ ప్రజల కిచ్చిన మాటను నెరవేర్చలేదని విమర్శించారు. 

మే 6, 2022 న వరంగల్ లో లక్షలాది మంది రైతుల సమక్షంలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని 2023 లో తుక్కుగూడాలో సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ లను ప్రకటించారని గుర్తు చేసారు.


రెండు లక్షల రుణమాఫీ  చేస్తామని ఆనాడు సోనియా గాంధీ మాట ఇచ్చారని  సచివాలయంలో కూర్చొని ధైర్యంగా తెలంగాణ రైతులకు 6,098 కోట్ల రూపాయలను రుణమాఫీ ఖాతాల్లో జమ చేస్తున్నామని అన్నారు.

రుణమాఫీకి సహకరించిన మంత్రులు, అధికారులకు రైతాంగం తరుపున ధన్యవాదాలు చెప్తున్నానంటూ తన 16 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఇది మరుపురాని రోజని ...రైతన్నలకు  రుణమాఫీ చేసే భాగ్యం తనకు  కలిగిందని అన్నారు. 

కేసీఆర్ కటాఫ్ పెట్టిన తేదీ మరునాటి నుంచే రుణమాఫీ అమలు చేస్తున్నాం...తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 వరకు రుణమాఫీ కటాఫ్ గా పెట్టామన్నారు. 

ఏ అవాంతరాలు లేకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. లక్ష లోపు రుణం ఉన్న రైతులకు ఈ రోజు రుణ విముక్తి కల్పించామని లక్ష నుంచి లక్షన్నర రుణం ఉన్న రైతులకు  త్వరలోనే రుణ విముక్తి కలుగుతుందని తెలిపారు. 

ఆగస్టు నెల పూర్తి కాకముందే రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. కొంత మంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ఉండాలనే అపోహ సృష్టిస్తున్నారని అది నిజం కాదని అన్నారు. 

రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు... రుణమాఫీకి పాస్ బుక్ నే కొలబద్ద తప్ప రేషన్ కార్డు కాదు...దొంగలు చెప్పే దొంగ మాటలను నమ్మోద్దని రైతులకు విజ్ఞప్తి చేసారు. 

ప్రతి రైతు రుణమాఫీ కి కావాల్సిన చర్యలు చేపడుతున్నామన్నారు. సమస్యలు తలెత్తితే బ్యాంక్ అధికారులను సంప్రదించాలన్నారు. 

బ్యాంకు అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు రుణమాఫీకి అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. 

" వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్వయంగా రైతు...ఆర్థిక మంత్రి గా భట్టి విక్రమార్క రుణమాఫీ కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేశారు..గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు... మా ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇస్తోంది... సంక్షేమ కార్యక్రమాలకు ఏడు నెలల్లో 29 వేల కోట్లు ఖర్చు చేశాం... గత ప్రభుత్వం అప్పులకు మిత్తి గా ప్రతి నెలా ఏడు వేల కోట్లు చెల్లిస్తున్నాం... రైతు రుణమాఫీ దేశానికి తెలంగాణ మోడల్ ఆదర్శంగా ఉండబోతుంది " అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రేస్ పార్టి ఎనిమిది నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా చేసిందన్నారు. .

 గతంలో బిఆర్ఎస్ పార్టి మాజి మంత్రి హరీశ్ రావు చేసిన సవాల్ ను గుర్తు చేస్తూ ఆయన ను  రాజీనామా చేయమని మేం అడగం.. ఇప్పటికైనా గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని వారు గుర్తు పెట్టుకోవాలి.. అన్నారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే కి ధన్యవాదాలు తెలుపుతు తీర్మానం చేశాం..



మల్లు విక్రమార్క భట్టి - ఉప ముఖ్యమంత్రి 



 రైతు రుణమాఫీ సందర్భంగా రాహుల్ గాంధీ ని ఆహ్వానించి వరంగల్ లో భారి  బహిరంగ సభ నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 

త్వరలో మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతులకు పెద్ద పండుగ దినమన్నారు. దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినది ఈరోజని ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్న తెలంగాణ వైపు దేశం మొత్తం ఆశ్చర్యంగా చూస్తున్నదని అన్నారు. 

దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర లేదన్నారు. 

ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన తెలంగాణ రాష్ట్రం దేశానికి మోడల్ గా నిలుస్తున్నదని అన్నారు. 

ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలో ఐదు గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయడంతో పాటు ఈరోజు రైతు రుణమాఫీ అమలు చేస్తూ మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. 

రాష్ట్ర విభజన తర్వాత ధనిక రాష్ట్రాన్ని బిఆర్ఎస్ చేతుల్లో పెట్టినప్పటికీ లక్ష రూపాయలు రుణమాఫీని నాలుగు విడతల్లో ఐదు సంవత్సరాలలో చేశారన్నారు. 

2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ లక్ష రుణమాఫీని ఐదేళ్లలో కూడా చేయలేకపోయిందన్నారు. 

ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్ల అప్పుతో ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినప్పటికీ రూపాయి రూపాయి పోగేసి నిబద్ధతతో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేసి చూపిస్తున్నామని మల్లు విక్రమార్క భట్టి అన్నారు.

వరంగల్ సభలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఒకేసారి రెండు లక్షలు రూపాయలు రుణమాఫీ చేస్తామని స్పష్టంగా భరోసా ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం 31 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తున్నాం అన్నారు.

రాష్ట్ర సచివాలయం నుంచి ఈరోజు 6వేల కోట్లకు  పైగా రైతుల ఖాతాలో నేరుగా రుణమాఫీ డబ్బులు లక్ష వరకు జమ చేస్తున్నామన్నారు.

ఆగస్టు 15 లోపు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కు  ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.

ఆగస్టు 15లోగా 2 లక్షలు రుణమాఫీ చేస్తామని సీఎం చేసిన సవాల్ కు అందరూ ఆశ్చర్యంగా చూశారన్నారు. 

స్వతంత్ర భారతదేశంలో ఏ కార్పొరేట్ సంస్థలు కూడా ఒకే రోజు బ్యాంకులకు 31 వేల కోట్ల రూపాయలు ఒకే సారి రుణాలు చెల్లించిన చరిత్ర ఇప్పటి వరకు లేదన్నారు.

రాష్ట్రంలో 40 లక్షల మంది రైతుల ఖాతాల్లో 31 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ డబ్బులను ప్రభుత్వం బ్యాంకులకు రైతుల పక్షాన చెల్లిస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఓట్లు వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టి  నాయకులకు పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు.



---ఎండ్స్


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు