రియల్ రాయల్ - బెంగాల్ టైగర్



 రియల్ రాయల్

బెంగాల్ టైగర్!


*********************


జ్యోతిబసు జయంతి


**********************


*_(సురేష్..9948546286)_*


✍️✍️✍️✍️✍️✍️✍️


జనం చేత ఎప్పుడూ

ఇక బస్సు బాసూ 

అనిపించుకోని *_బసు.._*

ఏకధాటిగా ఇరవై మూడేళ్లు

అదే కుర్చీలో..

దేదీప్యమాన "జ్యోతి"లా..

_*అఖండ ఖ్యాతితో..!*_


*పశ్చిమ బెంగాల్..*

*జ్యోతి బసు..*

బొమ్మా బొరుసా

అనలేదు జనం..

*_బసునే మా బాసు.._*

*_ఆయనే సెభాసు..!_*


ముఖ్యమంత్రి అయ్యాక..

అవ్వక మునుపు కూడా *కేసులున్న* నేతల రాజ్యంలో

బసు కెరీర్లో అవినీతి పూజ్యం

అందుకే ఆయనకు 

*_సదా రాజపూజ్యం..!_*


ప్రధాని పదవి రేసులోనూ

బసు..అప్పుడే తిరకాసు..

పార్టీ పాలసీ..

ఆపేసింది లెగసీ..

లేదంటే తొంభై ఏడులోనే

ఈ రేడు అయ్యేవాడు

హస్తినలో తిరుగులేని

నాయకుడు..!


💐💐💐💐💐💐💐

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు