హైదరాబాద్: పోలీసులు ఎంతగా గట్టి నిఘా ఏర్పాటు చేసినా డ్రగ్స్ విక్రేతలు వినియోగ దారులు రక రకాల పద్దతుల్లో వాటిని అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా పోలీసులు ఓ నెట్ వర్క్ ను చేదించారు. డెలివరి బాయ్ ముసుగులో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి టీజీ న్యాబ్ ను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
నిందితుడి నుంచి 15 గ్రాముల ఎండీఎంఏ, 22.5 కేజీల గంజాయి, 491 గ్రాముల హ్యాష్ ఆయిల్, 71 నైట్రోజన్ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ వినీత్ కేసు వివరాలను వెల్లడించారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన షేక్ బిలాల్(28) ఇంటర్ చదివే సమయంలోనే గంజాయికి అలవాటు పడ్డాడు. కరోనా తర్వాత హైదరాబాద్ మాదాపూర్ ఇజ్జత్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ పాత పరిచయాల నేపథ్యంలో అరకు నుంచి గంజాయి తెచ్చి దాదాపు 40.. 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో నిందితుడి ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు భాను తేజ జైలులో ఉన్నాడని, అతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తామని డీసీపీ తెలిపారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box