కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
జీవోలు విడుదల చేసిన ప్రభుత్వం
పటేల్ రమేష్ రెడ్డికి పదవి
జగ్గారెడ్డి సతీమణి నిర్మలకు సైతం పదవి
మరో విడత పదవులు పంపిణీ చేయనున్న సిఎం
జిల్లా గ్రంధాలయాలు -మార్కెట్ కమీటీలు - ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు
తెలంగాణలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది. ఈ మేరకు గత మార్చిలోనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయగా.. తాజాగా జీవో జారీ అయింది. పార్టీలో చురుగ్గా పనిచేసి సేవలందించిన వారిని సీఎం రేవంత్ రెడ్డి పదవులకు ఎంపిక చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపునిస్తూ పదవులిచ్చారు.
మరో విడత నామినేటెడ్ పాస్టులు భర్తి చేయాలని కసర్తతు జరుగుతోందని సమాచారం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కార్పోరేషన్ చైర్మన్లతో పాటు జిల్లా స్తాయిలో ఉన్న గ్రంధాలయ సంస్థల చైర్మన్లు,, మార్కెట్ కమిటీల చైర్మన్లు ఇతర నామినేటెడ్ పోస్టుల కోసం కసర్తతు జరుగుతోంది.
నల్గొండ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు అటవీ అభివృద్ధి సంస్థ, గుర్నాథ్ రెడ్డికి పోలీసు గృహనిర్మాణ సంస్థ, జగ్గారెడ్డి సతీమణి నిర్మలకు పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ, కాల్వ సుజాతకు వైశ్య సంస్థ ఛైర్మన్ పదవులు దక్కాయి.
కార్పొరేషన్ ఛైర్మన్ల వివరాలు ఇవి...
పటేల్ రమేశ్ రెడ్డి -టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్
నిర్మల (జగ్గారెడ్డి సతీమణి)- పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ
పొదెం వీరయ్య- అటవీ అభివృద్ధి సంస్థ
గుర్నాథ్ రెడ్డి (కొడంగల్)- పోలీసు గృహనిర్మాణ సంస్థ
కాల్వ సుజాత- వైశ్య సంస్థ
నేరెళ్ల శారద -మహిళా కమిషన్
నూతి శ్రీకాంత్ -బీసీ ఆర్థిక సంస్థ
రాయల నాగేశ్వరరావు- గిడ్డంగుల సంస్థ
ఎన్. ప్రీతమ్ -ఎస్సీ కార్పొరేషన్
శివ సేనా రెడ్డి -తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ
ఈరవత్రి అనిల్- ఖనిజాభివృద్ధి సంస్థ
మెట్టు సాయికుమార్- మత్స్య సహకార సంఘాల సమాఖ్య
జ్ఞానేశ్వర్ ముదిరాజ్- విజయా డెయిరీ
బెల్లయ్య నాయక్- గిరిజన సహకార ఆర్ధిక సంస్థ
జంగా రాఘవరెడ్డి -ఆయిల్ ఫెడ్
రియాజ్- గ్రంథాలయ పరిషత్
జగదీశ్వర్రావు (కొల్లాపూర్)- ఇరిగేషన్ డెవలప్‌మెంట్ సంస్థ
ఎస్. అన్వేష్ రెడ్డి- విత్తనాభివృద్ధి సంస్థ
ఎం. విజయబాబు- రాష్ట్ర సహకార గృహనిర్మాణ సమాఖ్య
కాసుల బాలరాజు- అగ్రోస్
బండ్రు శోభారాణి- మహిళా సహకార అభివృద్ధి సంస్థ
మానాల మోహన్ రెడ్డి- రాష్ట్ర సహకార యూనియన్
చల్లా నరసింహారెడ్డి- అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ
కె. నాగు- గిరిజన సహకార, ఆర్థికాభివృద్ధి సంస్థ
జనక్ ప్రసాద్- కనీస వేతన సలహామండలి
ఎం.వీరయ్య- వికలాంగుల సంస్థ
నాయుడు సత్యనారాయణ- హస్తకళల సంస్థ
ఎం.ఎ. జబ్బార్- వైస్ చైర్మన్, మైనార్టీల ఆర్థిక సంస్థ
మల్ రెడ్డి రాంరెడ్డి- రోడ్డు అభివృద్ధి సంస్థ
జె.జైపాల్- అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ
ఈ వెంకట్రాంరెడ్డి- కాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థ
ఎం.ఎ.పహీం- తెలంగాణ ఫుడ్స్
ఎ. ప్రకాశ్ రెడ్డి- రాష్ట్ర ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్
కె. నరేందర్ రెడ్డి- శాతవాహన అర్బన్ అభివృద్ధి సంస్థ
పుంజాల అలేఖ్య- సంగీత నాటక అకాడమీ
ఎన్. గిరిధర్ రెడ్డి- ఫిలిం డెవలప్‌మెంట్ సంస్థ
మన్నె సతీష్ కుమార్- రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి సంస్థ
---ఎండ్స్
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box