*_దర్శక శకంలో_*
*_ఆయనదో శతకం..!_*
_(కోడి రామకృష్ణ జయంతి)_
*_(సురేష్..9948546286)_*
________________________
ఆయన తలకు
బ్యాండ్ బిగించాడంటే
*_దేవీపుత్రుడు_*
నడుం బిగించి
*_అరుంధతి_* సాక్షిగా
*_దేవుళ్ళు_* అందరినీ
భూమిపైకి దింపినట్టే..!...
తెల్ల చొక్కా..తెల్ల ప్యాంటు
ధరించి మెగాఫోన్ పట్టుకుంటే
భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో..
మంగమ్మ గారి మనవడు..
ముద్దుల మామయ్య..
మువ్వగోపాలుడు
ఇలా హిట్టు మీద హిట్టు
కొట్టాల్సిందే..!
కోడి రామకృష్ణ..
చిరంజీవి బుద్ధీజీవి అయినా
అతగాన్ని ఇంట్లో రామయ్య
వీధిలో కృష్ణయ్యగా మార్చి..
జనాల్ని ఏమార్చే సుబ్బారావుగా
గొల్లపూడి మారుతీరావును
గల్లీలోకి దింపి..
పెద్ద హిట్టు కొట్టిన
దర్శకరత్న దాసరి శిష్యరత్న
కోడి అలా నూరు సినిమాల
వరకు కూస్తూనే..
అరుంధతితో అనుష్కను
జేజమ్మను చేసి
జనాలను మాయ చేసిన
దర్శక దిగ్గజం..
ఆయన సినిమాల్లో
కథకే అసలైన హీరోయిజం..!
ప్రయోగాలు చేశాడు..
గ్రాఫిక్స్ చేయించాడు..
భారత్ బంద్ కూ
పిలుపు ఇచ్చాడు..
సోగ్గాడు శోభనాద్రి
ఇమేజ్ కి తగ్గట్టు...
అచ్చొచ్చిన శారదను..
నచ్చొచ్చిన వాణిశ్రీని
జత చేర్చి
ఏమండీ..ఆవిడొచ్చింది..
అంటూ కవ్వించాడు..
తానూ వేషం కట్టి నవ్వించాడు!
దొంగ..ఆ ఒక్క పేరు మీదే
దొంగాట..దొంగ గారూ స్వాగతం
దొంగోడి పెళ్లి..దొంగోడొచ్చాడు..
దొరగారింట్లో దొంగోడు...
ఓ పరంపర..
తాను ప్రవేశపెట్టిన
కాస్ట్యూమ్స్ కృష్ణనే
ప్రధాన పాత్రలో దింపి
పెళ్ళాం చెబితే వినాలి..
అంటూ నీతి బోధించిన
పెళ్లి మీదా తీసాడండోయ్
పెళ్లి..పెళ్లికానుక..
పెళ్ళిపందిరి...
సినిమాలు...
ఇలా పెళ్లి చేసి మళ్ళీ
పుట్టింటికి రా చెల్లీ
అంటూ పంజరంలో
ఉన్న పిల్లని
భారతంలో బాలచంద్రుడికి
అప్పగించి...
పంచదార చిలకను పట్టి
సినిమా పరంగా...
తానూ భారతరత్న అయ్యాడు..
కోడి రామకృష్ణ..!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box