కిట్స్ వరంగల్ కు తెలంగాణ విభాగానికి గానూ ఐఎస్ టీఈ న్యూఢిల్లీవారి ఉత్తమ ఫ్యాకల్టీ చాప్టర్ అవార్డు
కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ (కిట్స్‌డబ్ల్యు) 2023-2024 విద్యా సంవత్సరానికి Inidian Society for Techniacal Education New Delhi - ఐఎస్ టీఈ న్యూఢిల్లీ వారు తెలంగాణ విభాగానికి గానూ ప్రతిష్టాత్మక ఐఎస్ టీఈ కిట్స్ డబ్ల్యూ చాప్టర్ కు ఉత్తమ ఫ్యాకల్టీ చాప్టర్ అవార్డుతో సత్కరించింది.
జూన్ 22, 2024న భువనేశ్వర్‌లో జరిగిన 53వ ఐఎస్ టీఈ జాతీయ వార్షిక సదస్సు సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేశారు.
రాజ్యసభ మాజి సబ్యులు కిట్స్ వరంగల్ ఛైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మి కాంత రావు తెలంగాణ విభాగానికి గానూ "ఐఎస్ టీఈ కిట్స్ డబ్ల్యూ ఫ్యాకల్టీ చాప్టర్ ఉత్తమ ఫ్యాకల్టీ చాప్టర్ అవార్డును అందుకున్నందుకు అధ్యాపక బృందాన్ని అభినందించారు.
రాష్ట్రంలో అత్యుత్తమ ప్రమాణాలకు విస్తృతమైన సాంకేతిక విద్యాభోదనకు ఇది నిదర్శన మని " ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు. "ఈ సర్టిఫికేట్ విద్యా నైపుణ్యం మరియు ఆవిష్కరణల పట్ల కిట్స్‌డబ్ల్యు యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది అని సగర్వంగా తెలిపారు.
కిట్స్ డబ్ల్యూ తరపున అవార్డును స్వీకరించిన, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మరియు హెడ్, సి - ఐ స్క్వేర్ ఆర్ ఈ (సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) ప్రొఫెసర్ కె. రాజనరేందర్ రెడ్డి తో పాటు ప్రొఫెసర్ అచ్యుత సమంత, కె ఐ ఐ టి విశ్వవిద్యాలయం & కె ఐ ఎస్ ఎస్ విశ్వవిద్యాలయం యొక్క గౌరవనీయ స్థాపకులు; ప్రొ. ప్రతాప్ సింగ్ కాకా సాహెబ్ దేశాయ్, ఐఎస్ టీఈ న్యూఢిల్లీ అధ్యక్షులు; ప్రొ. దీపక్ కుమార్ బెహెరా, కె ఐ ఎస్ ఎస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్; కె ఐ ఐ టి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.సరంజిత్ సింగ్; ప్రొఫెసర్ ప్రశాంత రౌత్రే, , కె ఐ ఎస్ ఎస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్; ప్రొఫెసర్ జ్ఞాన రంజన్ మొహంతి, , కె ఐ ఐ టి యూనివర్సిటీ రిజిస్ట్రార్; మరియు ఐఎస్ టీఈ, న్యూఢిల్లీ కార్యనిర్వాహక కార్యదర్శి డా. సయ్యద్ మాజిద్ అలీ పాల్గొన్నారు.
"2024కి గానూ విశిష్ట పూర్వ విద్యార్థుల ఉత్తమ అధ్యాపక అవార్డును అందుకున్న ప్రొఫెసర్ కె. రాజనరేందర్ రెడ్డిని, కిట్స్ డబ్ల్యూ చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు మరియు ప్రిన్సిపాల్ అశోకా రెడ్డి శాలువాతో సత్కరించిజ్ఞాపిక అంద జేసి సత్కరించి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.
కిట్స్ వరంగల్ కోశాధికారి పి.నారాయణరెడ్డి ,హుస్నాబాద్ నియోజకవర్గ మాజి ఎమ్మెల్యే ,కిట్స్ అడిషనల్ సెక్రెటరీ, వి. సతీష్ కుమార్ అభినందనలు తెలిపారు.
కిట్స్‌డబ్ల్యు రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, ఐఎస్ టీఈ కిట్స్ డబ్ల్యూ చాప్టర్ చైర్మన్ డాక్టర్ హెచ్.రమేష్ బాబు, డాక్టర్ టి. సెంథిల్ మురుగన్, కిట్స్‌డబ్ల్యు అలమ్నై అఫైర్స్ & ఎక్స్‌టర్నల్ రిలేషన్స్, ఇంచార్జి ప్రొఫెసర్, డాక్టర్ ఎం. శ్రీకాంత్, ఫ్యాకల్టీ ఇంచార్జి, డా. ఓ. ఆంజనేయులు, వివిధ విభాగాల డీన్లు, వివిధ విభాగాల హెడ్స్, ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి, ప్రజా సంబంధాల అధికారి, డా. డి. ప్రభాకరా చారి, అధ్యాపకులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box