బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

పంచాయతీరాజ్ శాఖపై ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.



స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో... రిజర్వేషన్లపై ఒక అవగాహన కోసం సోమవారం ముఖ్యమంత్రి మంత్రులు అధికారులతో సమావేశమయ్యారు.

స్థినక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు అవకాశాల పై  చర్చించారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రెజర్వేషన్ల పెంపుపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమావేశంలో  మంత్రులను అడ్గి సూచనలు కోరారు. 

 ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న,బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ సమావేశంలో ముఖ్యమంత్రికి తమ అభిప్రాయాలను వివరించారు.

రిజర్వేషన్ల విషయంలో అన్ని కూలంకషంగా చర్చించి రిజర్వేషన్ల పెంపుపై సరైననిర్ణయం తీసుకోవాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ీ విషయంలో 

ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. .

అసెంబ్లీ సమావేశాల్లోగా మరోసారి సమావేశమవ్వాలని  నిర్ణయించారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు