జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు నుండి ఆయకట్టు కాలువలకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్..
భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం జోగంపల్లి గ్రామ శివారులోని మధ్యతరహా ప్రాజెక్ట్ చలివాగు నుండి ఈరోజు సోమవారం సాయంత్రం *భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* ఆయకట్టు కాలువలకు నీటిని తూము వద్ద గేట్ వాల్వ్ తిప్పి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ... నియోజకవర్గంలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన జోగంపల్లి చాలివాగు ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ వర్షాకాలంలో రైతులకు ఆయకట్టు కాలువల ద్వారా నీటిని పంట పొలాలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 3046 ఎకరాల పంట పొలాలకు నీటిని అందించడం జరుగుతుందన్నారు.
ఈ కాలువల ద్వారా శాయంపేట మండలంలోని జోగంపల్లి, పెద్దకోడెపాక, కొప్పుల గ్రామాలతో పాటు కొత్తపల్లిగోరి మండలంలోని రాజక్కపల్లి, చిన్నకోడెపాక, దామరంచపల్లి, చెన్నాపూర్ గ్రామాల రైతులకు సాగు నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట శాయంపేట మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇరిగేషన్ ఈఈ, డీఈ లు ఉన్నారు.
------ends
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box