ఐక్య ఉద్యమాలతోనే బి.సి హక్కుల సాధన

 


ఐక్య ఉద్యమాలతోనే బి.సి హక్కుల సాధన

చట్టసభల్లో వాటా కోసం దేశ వ్యాప్త ఉద్యమం

ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్

జాతీయ బి.సి చైతన్య సమితి అధ్యక్షుడు రమణ


     తరతరాలుగా ఉత్పత్తి, శ్రమ చేస్తూ ప్రతి పనిలో బి.సి లు కీలకపాత్ర పోషిస్తున్నప్పటికి అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో ఉన్నారని దేశాన్ని ఏలుతున్న పాలకులు బి.సి లను పనివాళ్ళుగా, ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, జాతీయ బి.సి చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రమణ అన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో జరిగిన జాతీయ బి.సి చైతన్య సమితి రాష్ట్ర స్థాయి సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. 



    గత 75 ఏండ్లుగా దేశాన్ని పాలిస్తున్న బ్రాహ్మణీయ ఆధిపత్య పాలక పార్టీలు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడుతూ బి.సి లకు తీరని అన్యాయం చేస్తున్నారని వారు విమర్శించారు. తెలంగాణలో సమగ్ర కుల జనగణన చేసి స్థానిక సంస్థల్లో బి.సి లకు 43 శాతం రిజర్వేషన్లు కల్పించి తదితర అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి చేస్తామని కామారెడ్డి బి.సి. డిక్లరేషన్ లో వాగ్దానం చేసి, మ్యానిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ విషయాల ఊసు ఎత్తకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడం చాలా ద్రోహమని వారు అన్నారు. బి.సి ల పునాధితోనే నిర్మితమైన తెలుగుదేశం పార్టీలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు కూడా బి.సి లకు రాజకీయ పదవులు ఇవ్వకపోవడం మోసమని అన్నారు. పాలకుల పోకడను గమనించి బి.సి లు ఐక్య ఉద్యమాలు చేసి వారి హక్కులను సాధించుకోవాలని అన్నారు. 



   దేశంలో వరుసగా మూడవ సారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం బిసి లను హిందువుల పేరున ఓటు బ్యాంకు గా వాడుకుంటున్నదని, ప్రదాని మోడీ బి.సి అయి ఉండి కూడా బి.సి కుల జనగణన చేయడం లేదని, బి.సి ల అభివృద్ధికి బడ్జెట్ లో కేటాయింపులు లేకపోవడం సిగ్గు చేటని వారు అన్నారు. బి.సి ల అభివృద్ధి బ్రాహ్మణీయ ఆధిపత్య పాలనలో జరగదని, బి.సి లు చట్టసభల్లోకి వెళ్ళినప్పుడే బి.సి ల అభివృద్ధి జరుగుతుందని వారు అన్నారు. సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా, చట్టసభల్లో బి.సి వాటా కోసం బి.సి లు దేశ వ్యాప్త ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. 

   చట్టసభల్లో బి.సి వాటా కోసం తెలంగాణలో 400 కిలో మీటర్ల పాదయాత్ర చేసిన సాయిని నరేందర్, వెలుగు వనిత, చాపర్తి కుమార్ గాడ్గే లను రమణ తదితరులు శాలువాలతో సత్కరించారు. 



    ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ వైస్ చైర్మన్ వెలుగు వనిత, జాతీయ సభ్యుడు చాపర్తి కుమార్ గౌడ్గే, జాతీయ బి.సి చైతన్య సమితి ప్రధాన కార్యదర్శి కోల ఏడుకొండలు, రాష్ట్ర యువజన అద్యక్షులు దుప్పుల శివాజీ, తేనె నాగేశ్వర్ రావు, గొడుగు శంకర్, వెంకటయ్య, మోక రవి, సహజీవన్, రాజ్ కమల్, సందే మాధవరావు, నరసింహ రాజు, వెలుగు యామిని తదితరులు పాల్గొనగా కళాకారులు బుల్లెట్ వెంకన్న, చంద్రకళ, నరసింహసామి పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు