అభినయమే ఐశ్వర్యమై.. అపురూప సౌందర్యమై..!




 అభినయమే ఐశ్వర్యమై..

అపురూప సౌందర్యమై..!

_________


(ఎలిశెట్టి సురేష్ కుమార్)

       9948546286


✍️✍️✍️✍️✍️✍️✍️✍️


ఏదో ఒక రాగం

పలికిందీ వేళ

నాలో నిదురించే 

గతమంతా కదిలేలా..


ఎంత అందమైనదో కదా

ఆ గతం..

పగలే వెన్నెల..

గోదారి గలగల..

కోయిలమ్మ కిలకిల..

నవ్వితే కురిసే నవరత్నాలు...

సంప్రదాయానికి చీరకట్టి

అందానికి పేరు పెట్టి..

చక్కగా బొట్టుపెట్టి..

వెండి తెరపై 

మెరిసిన సౌందర్య..

మురిపించిన ముగ్ధ..!


కన్నడ సీమ నుంచి

ఇటు తొంగి చూసిన ఇంతి

ఇక్కడ ఇంటింటి ఆడపడుచై..

ఆహార్యంతో ఆకట్టుకుంది..

అభినయంతో అలరించింది..!


ఈ తరంలో ఆనాటి పోకడలు

స్టెప్పులో..మేకప్పులో

అతికి వెళ్ళని అతివ..

పాత్రకు అతికినట్టు..

ఆ కట్టు బొట్టు..

అందులోనే రసపట్టు..

అదే సౌందర్య కనికట్టు..!


అపురూపమైనదమ్మ నాయికమ్మ..

ఆ పాత్రకు సరిపోలిక సౌందర్యమ్మ..

మెరుపులా వచ్చింది..

అందరికీ నచ్చింది..

వెంకీతో పవిత్రబంధంగా..

చిరు అన్నయ్యగా..

నాగార్జునేమో హలో బ్రదర్..

టాప్ హీరోతోనూ 

జతకట్టిందీ 

సినిమా అమ్మోరు..

చినుకు చినుకు అందెలతో

చిటపట చిరుసవ్వడితో

వాన జాణ ఆడింది వయ్యారంగా..

ఎంత నిగర్వంగా

బాబూమోహన్ తోనూ..

ఆలీతోనూ గెంతింది

వయ్యారంగా...

జుంబారే ఒ జుంబరే..

ఇలా సూపర్ స్టారునీ మెప్పించిన వయ్యారే..!


వినోదం పంచిన అందం...

అభినయ సుగంధం,.

అంతలోనే ఎంత విషాదం..

విహంగమే భుజంగమై 

కాటు వేసి  

మిగిల్చింది అదెంత విషాదం!

********


  సౌందర్య పుట్టినరోజు

        18.07.1976

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు