దేవుడు ఆదేశిస్తే..!


దేవుడు ఆదేశిస్తే..!

ఒక పెద్ద కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత కలిగిన ఓ పేద స్త్రీకి ఆలిండియా రేడియోలో సహాయం కోసం అర్ధించే అవకాశం కల్పించారు.

ఆమె తనకు సాయం చేయమని కోరుతూ 

ఆ భగవంతుడు ఖచ్చితంగా ఎవరో ఒక దాతను పంపిస్తాడన్న విశ్వాసం వ్యక్తం చేసింది.

అది విన్న 

ఓ నాస్తిక ధనవంతుడు  ఆమెకు దేవుడిపై గల విశ్వాసాన్ని అవహేళన చేద్దామని సంకల్పించాడు.

వెంటనే పెద్ద హోటల్ నుంచి 

ఆ  కుటుంబానికి  సరిపడా భోజనం తెప్పించి తన మనిషి ద్వారా ఆమె ఇంటికి పంపాడు.


వెళ్ళే ముందు తన మనిషితో ఇలా అన్నాడు "ఆమె భోజనం ఎవరు పంపారని అడిగితే దెయ్యం పంపిందని చెప్పమ"ని..

    

ఆ మనిషి ఆ పేదరాలి ఇంటికి వెళ్లి భోజనం పాకెట్లు ఇచ్చాడు.ఆమె వాటిని అందుకుని ధన్యవాదాలు చెప్పింది.


అప్పుడు మనిషి

"ధన్యవాదాలు చెప్పావు సరే..మీకు భోజనం ఎవరు పంపారని అడగవా"అన్నాడు.


దానికి ఆ ఇల్లాలు 

సావధానంగా ఇలా అంది..

"కృతజ్ఞతలైతే చెప్పుకుంటాను గాని ఎవరో అడగను..మంచి మనసుతో పంపే ఎవరైనా నాకు దేవునితో సమానం..

ఇప్పుడు అదెవరో తెలుసుకుంటే మరోసారి 

దేవుణ్ణి కాకుండా నేరుగా వారినే అడగాలని అనిపిస్తుంది.అందుకే అడగలేదు..అని చెప్పింది.

అప్పుడు ఆ మనిషి ఇలా అన్నాడు..ఒకవేళ దెయ్యమే పంపించి ఉంటే..

దానికి ఆ స్త్రీ స్ధిరంగా 

ఇలా బదులిచ్చింది..

"దేవుడు ఆదేశిస్తే దెయ్యమైనా ఇస్తుంది.."

 

*అక్కడే..అప్పుడే దైవంపై నమ్మకం మరోసారి గెలిచింది..*

*వికృత ఆలోచన తలదించింది.!*


*_సురేష్..9948546286_*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు