తండ్రికి మించిన తనయ-సంకల్పానికి శెల్యూట్ - అధికార హోదాలో తండ్రి కూతురు భావోద్వేగం

 


తమ పిల్లలు తమ కన్నా ఎత్తు ఎదగాలని ఉన్నత స్థానాల్లో  నిలవాలని  ప్రతి తల్లి దండ్రులు కోరుకుంటారు. అలా కొందరి కలలు నెర వేర వచ్చు కొందరి కలలు  నెర వేరక పోవచ్చు. ఈ ఫోటోలో చూస్తున్నది తండ్రి కూతురు. కూతురుకు తండ్రి అధికార హోదా ప్రోటో కాల్ మేరకు సెల్యూట్ చేసి గర్వంగా ఫీలయ్యాడు. 

సెల్యూట్  చేసిన  వ్యక్తి తెలంగాణ పోలీసు అకాడమీలో  డిప్యూటీ డైరక్టర్ గా పనిచేస్తున్న ఎన్ వెంకటేశ్వర్లు. కూతురు ఎన్ ఉమా హారతి ఆలిండియా 2022 బాచి ఐఏఎస్ లో  ధర్డ్ టాపర్. 

పోలీస్ ఆకాడమీకి ఐఏఎస్ హోదాలో వచ్చిన కూతురుకు ప్రోటో కాల్ ప్రకారం తండ్రి పుష్పగుచ్చం ఇచ్చి సెల్యూట్ చేసారు. ఈ ఉద్విగ్న క్షణాలు ఎలా ఉంటాయో ఊహించు కొండి. మీ బిడ్డలు కూడ ఇలా ఎదగాలని ఇలాంటి  క్షణాల కోసం ఎదురు చూస్తామని చెప్పండి. 

ఉమా హారతి ఐఐటి హైదరాబాద్ లో సివిల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకుని  పట్టువదలని విక్రమార్కగా సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. మొదటి  అటెంప్ట్ లో ఆమె విజయం సాధించ లేక పోయారు. పట్టుదలతో సివిల్స్ కు రెండో సారి మూడోసారి నాలుగో సారి ఇలా వరుసగా ఐదు సార్లు దండయాత్రలు చేసి చివరికి ఐదో  సారి ఏకంగా  విజయం సాధించడమే కాక ఆలిండియాలో మూడో టాపర్ గా నిలిచారు.


నూకల ఉమా హారతి సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన వారు. మద్యతరగతి కుటుంబంలో పుట్టినప్పటికి తల్లి దండ్రుల ప్రోత్సాహంతో వారి  ఆశయం నెరవేర్చేందుకు చాలా కష్టపడ్డారు.  చివరికి అనుకున్నది సాధించారు. పోలీస్ అధికారి అయిన  తన తండ్రే తనకు ఇన్స్పిరేషన్ అని ఉమా హారతి అంటుంటారు.

ఈ రోజుల్లో  చదువుల ద్వారా  చాలా గొప్ప హోదా కలిగిన ఉద్యోగాలంటే యూనియన్ పబ్లిక్  సర్వీస్ కమీషన్  ఉద్యోగాలు.  ప్రజాస్వామ్య వ్యవస్థలో జోడు గుర్రాల పరిపాలనలో ఇలాంటి అధికారులే దేశాన్ని ముందుకు నడిపించేది.  మీరు కూడ మీ పిల్లలకు చెప్పండి. చేస్తే రాజకీయాలు చేయాలని లేదా ఇలాంటి సర్వీసుల్లో విజయం సాధించాలని. 

--ఎండ్స్


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు