రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలలో ఒకటి ఎంఐఎం గెలుకుంటే మరో పదహారింటిలో సగం బీజెపి సగం కాంగ్రేస్ గెలుస్తున్న ట్రెండ్ కనిపిస్తోంది. బిఆర్ఎస్ మాత్రం ఒకే ఒక్క సీటులో ఆధిక్యతలో ఉంది.
ఖమ్మం లో కాంగ్రేస్ పార్టి భారి మెజార్టి సాధించే పరిస్థితి కనిపిస్తోంది. ఇక వరంగల్, మహబూబూబాద్, నల్గొండ, పెద్దపల్లి, జహీరాబాద్ లో అధిక్యతలో ఉంది.
బీజెపి డబుల్ డిజిట్ కాదు కాని కాంగ్రేస్ కు గట్టి పోటి ఇచ్చి సింగిల్ డిజిట్ కు పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజిగిరిలో ఉదయం 11 గంటల సమయం వరకు అందిన లెక్కింపు మేరకు ఆధిక్యతలో ఉంది. మెదక్ లో బిఆర్ఎస్ ఆభ్యర్థి ఆధిక్యతలో ఉన్నా ఇక్కడ బీజెపి తో గట్టి పోటి కనిపిస్తోంది. చివరి రౌండ్ వరకు బిఆర్ఎస్ ఆధిక్యత కొనసాగుతుందా లేదా చూడాలి. హైదరాబాద్ లో ఎంఐఎం అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టి అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box