ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ధాటికి వైకాపా కుదేలైంది.. పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలు ఓటమి బాటలో ఉన్నారు..
సిఎం జగన్ ఇక మాజి సిఎం కానున్నారు. ఏడు పదుల వయస్సు దాటిన చంద్రబాబు నాయుడు మరో సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. జగన్ ఓటమి పక్కన పెడితే కనీసం చెప్పుకోతగిన స్థానాలు కూడ దక్కేట్లు లేవు.
మంత్రుల్లో ధర్మాన ప్రసాద రావు, సీదిరి అప్పల రాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, గుడివాడ అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేశ్, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడదల రజనీ, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఉష శ్రీ చరణ్ తదితరులు వెనుకంజలో కొనసాగుతున్నారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా లోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోంది.
మరోవైపు, జిల్లాలకు జిల్లాలనే కూటమి స్వీప్ చేసేలా కనిపిస్తోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 12,
చిత్తూరులో 14కు 12 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
తూర్పు గోదావరిలో 19కి 19,
గుంటూరులో 17కి 16,
కడప 10లో 6 చోట్ల లీడ్‌లో కొనసాగు తున్నారు.
కృష్ణా జిల్లాలో 16కి 15,
కర్నూలులో 14కి 11,
నెల్లూరులో 10కి 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు..
ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు 10,
శ్రీకాకుళంలో 10కి 9,
విశాఖ పట్నంలో 15కి 13,
విజయ నగరంలో 9కి 8,
పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 14 చోట్ల లీడ్‌లో కొనసాగు తున్నారు..
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box