స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.


 స్ట్రాంగ్ రూములను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.


ఏ ఆర్ ఓ లు ప్రతిరోజు స్ట్రాంగ్ రూములను పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ.


వరంగల్, 16 మే 2014.


వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూములను గురువారం రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సందర్శించి  వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలలో వినియోగించి భద్రపరిచిన ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి, స్ట్రాంగ్ రూములకు సంబంధించిన లాగ్బుక్, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద  ఉన్న సీసీ కెమెరాల పర్యవేక్షణకు సంబంధించిన  వాచ్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఏనుమాముల మార్కెట్ యార్డులో స్ట్రాంగ్ రూంలకు  ప్రక్కన ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆయా స్ట్రాంగ్ రూముల సీసీటీవీ కవరేజ్  ఎల్ యి డి స్క్రీన్ లపై ప్రదర్శిస్తున్నామని అన్నారు.  పారదర్శకంగా, అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో జూన్ 4వ తేదీ వరకు ఓట్ల లెక్కింపు జరిగే వరకు దృశ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.


 ప్రతిరోజు  సహాయ రిటర్నింగ్ అధికారులు స్ట్రాంగ్ రూములను సందర్శించి భద్రత తదితర అంశాలను పరిశీలించి నివేదించాల్సిందిగా కోరడం  జరిగిందన్నారు. 


స్ట్రాంగ్ రూమ్ 24 గంటలు సాయుధ బలగాల రక్షణలో ఉంటుందని సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం కంట్రోల్ రూమ్ లో పర్యవేక్షించబడుతుందని అన్నారు.   స్ట్రాంగ్ రూములకు సీసీటీవీ కవరేజ్ తో సహా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించడానికి గెజిటెడ్ స్థాయి అధికారులతో పాటు పోలీస్ అధికారులు 24 గంటలు షిఫ్ట్ ల వారిగా డ్యూటీలో  ఉంటారన్నారు.


ప్రతి స్ట్రాంగ్ రూం కు ఒక గార్డ్ ఉంటారని, వారిచే లాగ్ బుక్ నిర్వహించబడుతున్నదని, స్ట్రాంగ్ రూం ఆవరణ లో ఎవరికి అనుమతి ఉండదని,అభ్యర్థులు వారి తరపున వచ్చే ఏజెంట్ లకు ప్రత్యేక రూం ఏర్పాటు చేసి అక్కడ వరంగల్ పార్లమెంట్ కు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూం ల సి సి పుటేజీ లను  పెద్ద తెరలు (స్క్రీన్ లు)ఏర్పాటు చేసి ప్రదర్శించడం జరుగుతున్నదని తెలిపారు. అభ్యర్థులు వారి ఏజెంట్లు  24 గం.లు అట్టి పుటేజీ లను చూడవచ్చునని (పరిశీలించవచ్చునని), పోలీసుల సమక్షం లో ఇన్నర్ పెరిమీటర్ వరకు వారికి పోలీస్ ఎస్కార్ట్ తో పరిశీలించవచ్చని, ఇట్టి విషయం లో ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఈ సందర్భం గా రిటర్నింగ్ అధికారి తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఉప తఃసిల్దార్లు రంజిత్, పోలీస్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు