ఇంద్రజ మ్యాజిక్

 


ఇంద్రజ మ్యాజిక్..
రాజు లాజిక్..
దర్శకేంద్రుడి జిమ్మిక్..!

జగదేకవీరుడు..

అతిలోకసుందరి..

09.05.1990

ఎక్కడి ఇంద్రకుమారి..

ఎక్కడి రాజు..

భూలోకంలో అదెంత తుపాను..

వసూళ్ల వర్షం..

జనం హర్షం..!


శ్రీదేవి రూపం..

చిరంజీవి హీరోయిజం..

దర్శకేంద్రుడి మాయాజాలం..

అబ్బా అనిపించిన సినిమా..

అబ్బ నీ తీయని దెబ్బ..

అతడు పురుషుల్లో పుంగవ..

ఉంగరం కోసం 

ఇంద్రజ తెగువ..

మొత్తంగా..

జగదేకవీరుడు..

అతిలోక సుందరి..

మండువేసవిలో

వినోదాల జల్లు..

కోవెలమూడి హరివిల్లు..!


అందాలలో 

అహో మహోదయం..

భూలోకమే నవోదయం..

అసలు ఊహకే అందని కథ

ఒకనాడు ఎన్టీఆర్ 

జగదేకవీరుడైతే..

మనకథలో 

టూరిస్ట్ గైడ్ రాజు..

నాటి ఇంద్రకుమారి సరోజాదేవిని మించి

శ్రీదేవి హొయలు..

ఆ ముద్దు మాటలు..

మానవా..ఆ పిలుపు మానవా..వారేవా..!


పేరుకే ఫాంటసీ..

రాఘవేంద్రుని లెగసీ..

చూస్తున్నంత సేపు అదోలాంటి అనుభూతి..

అమ్రిష్ పురి అషాడభూతి..

వెరసి జగదేకవీరుడు..

అతిలోకసుందరి..

ప్రత్యేకరీతి..!


1990 తుపాను...మే నెలలో కూడా జనం స్వెట్టర్లు వేసుకుని తిరిగిన రోజులు..

ఎడతెరిపి లేని వానలు..

తెగిన రహదారులు..

కూలిన వంతెనలు..

అలాంటి బీభత్సంలో

ఈ సినిమా..వసూళ్ల వెల్లువ)


*_సురేష్ కుమార్..ఇ_*

       9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు