కోవిడ్ తోక తెగినట్టే..!

మంచి పరిణామం..



ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడిప్పుడే కోవిడ్ ను మహమ్మారి అనే కోణం నుంచి గాక కనీసం ఇంకొన్నాళ్ళ పాటు మనతో ఉండబోయే ఒక వైరస్ గా చూడ్డానికి సిద్ధం అవుతోంది.

బుధవారం జరిగిన సమావేశంలో హూ ప్రపంచం మొత్తం మీద కోవిడ్ పరిస్థితిని సమీక్షించి ఇక కోవిడ్ మహమ్మారి స్థాయిని కోల్పోయినట్టేనన్న అంచనాకు వచ్చింది.


ఈ నేపథ్యంలో తదనుగుణంగా కోవిడ్ ప్రోటోకాల్స్ ను సవరించనున్నారు.కోవిడ్ కారణంగా కుదేలైన చిన్న దేశాలను ఎలా ఆదుకోవాలి అనే అంశాలపై కూడా చర్చలు జరిగాయి.ఆ దేశాలలో వైద్య సౌకర్యాలు 

మెరుగు పరిస్తే ఒకవేళ భవిష్యత్తులో కోవిడ్ కావొచ్చు.. ఇంకేమైనా వైరస్ లేదా ఇతర రోగాల జాడలు కనిపిస్తే మొగ్గలోనే తుంచవచ్చన్నది ప్రణాళిక.

అలాగే మందులు..

పరికరాల సత్వరం రవాణా చేసేందుకు అవసరమైన

ఏర్పాట్లు చేయాలన్నది ఒక సూచన.అలాగే మిగిలిన అన్ని దేశాలు కూడా తగు ప్రణాళికలు రూపొందించుకుని భవిష్యత్తులో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోడానికి సిద్ధపడాలి

-----సురేష్ కుమార్


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు