పేపర్ లీక్ కేసులో కీలక మలుపులు

బిఆర్ఎస్  బిజెపి ప్రతీకార రాజకీయాల నేపద్యంలో ప్రశ్నార్దకంగా మారిన కేసు


టెన్త్ హిందీ పేపర్ లీకేజి కేసు అనేక మలుపులు తిరిగి రాజకీయ రంగు పులుముకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మద్య కేసు  విశ్వసనీయత ప్రశ్నార్దకంగా మారింది. ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై బిజెపి శ్రేణులు మండి పడితున్నాయి. బిజెపి  రాష్ట్ర పార్టి అధ్యక్షులు బండి సంజయ్ ను పేపర్ లీకేజి కేసులో పోలీసులు మొదటి ముద్దాయిగా చేర్చారు. ఆయనతో పాటు జర్నలిస్ట్  బొరం ప్రశాంత్ ను ఏటూ గా  మహేష్ ను ఏత్రీగా శివ గణేష్ ను ఏ ఫోర్ గా మైనర్ బాలున్ని ఏ ఫైవ్ గా చేర్చారు.

బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జర్నలిస్ట్ ప్రశాంతో కల్సి పేపర్ లీకేజ్ కుట్ర చేశారని పోలీసుల అభియోగం. ఈ మేరకు బండి సంజయ్ ను మంగళవారం రాత్రి కరీంనగర్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు అప్పటి నుండి పోలీస్ స్టేషన్లు తిప్పుతూ బుధవారం వరంగల్ జిల్లా వైపు తీసుకువచ్చారు. పాలకుర్తి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత సాయంత్రం వరంగల్ కోర్టుకు తీసుకు  వచ్చారు. 

ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టి కార్యకర్తలు బండి సంజయ్ పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు లాఠి చార్జి చేసి బిఆర్ఎస్ కార్యకర్తలను చెదర గొట్టారు. 

వరంగల్ పోలీస్ కమీషనర్ ఏ.వి రంగనాధ్ మాట్లాడుతూ పేపర్ లీకేజి కేసులో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించాడన్నారు. పేపర్ లీకేజి ముందు రోజు ప్రశాంత్ తో వాట్సాఫ్ కాల్ మాట్లాడారని చాటింగ్ చేసారని తెల్లవారి అవే విషయాలు మీడియాలో మాట్లాడారని అన్నారు. ప్రశాంత్ ఫోన్ లో చాలా మెసేజ్ లు డిలీట్ అయ్యాయన్నారు. ప్రశాంత్ ఫోన్ లో మెసెజ్ లు  రికవరి చేస్తామన్నారు.  బండి సంజయ్ ఫోన్ లేదని చెబుతున్నారని ఆయనను కస్టడీకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని అన్నారు.

పార్లమెంట్ స్పీకర్ కు కూడా బండి సంజయ్ అరెస్టు పై సమాచారం ఇచ్చామని  వారెంట్ - నోటీస్ లేకుండా కూడా అరెస్ట్ చేయవచ్చని సెక్షన్ 41సిఆర్ పిఎస్ చెబుతోందని కమీషనర్ తెలిపారు. పక్కా లీగల్  ప్రాసెస్ లో చేస్తున్నామని తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని అన్నారు.

పేపర్ లీక్ కేసుపై  కెటిఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బండి సంజయ్ ను దోషిగా చూపుతూ ఆరోపణలు చేసారు.  

బిజెపి నేతలు ఆందోళనకు సిద్దపడగా అనేక జిల్లాలలో అరెస్టు చేసారు. పలువురు నేతలను హవుజ్ అరెస్ట్ చేశారు. 

బండి సంజయ్ అక్రమ అరెస్ట్ పై బిజెపి నాయకులు మండిపడుతున్నారు. కావాలనే బండి సంజయ్ ను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. కెసిఆర్ కూతురు కవిత లిక్కర్ కేసులో ఇడి విచారణను ఎదుర్కుంటున్న నేపద్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీక్ లో అప్రతిష్టపాలై బిజెపి నేతలపై క్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. 

బండి సంజయ్ అరెస్టు ను ప్రశ్నిస్తూ బిజెపి న్యాయ విభాగం నేతలు హై కోర్టును ఆశ్రయించారు. గురువారం నాడు బండి సంజయ్ కేసుపై విచారణ జరగనుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు