ముగిసిన భారత్ జోడో యాత్ర - తండ్రిని నానమ్మనుతల్చుకుని రాహుల్ ఎమోషన్


కాంగ్రేస్ నేత రాహుల్ గాంధి చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. కన్యాకుమారి నుండి సెప్టంబర్ 7 వ తేదీన ప్రారంభమైన యాత్ర 145 రోజుల పాటు 14 రాష్ట్రాల గుండా 75 జిల్లాల ద్వారా జమ్ము కాశ్మీర్ వరకు కొనసాగింది. శ్రీనగర్ లో సోమవారం ముగింపు సభ జరిగింది.  ముగింపు సభను భారీగా నిర్వహించాలని తలపెట్టారు కాని వాతావరణం సహకరించలేదు. ఏకధాటిగా మంచు కురవడంతో పాటు వర్షం కురవడంతో సభకు తీవ్ర ఆటంకం కలిగింది. అయినా ప్రతి కూల పరిస్థితిలోనే సభను పూర్తి చేశారు.

మంచుకురుస్తుండగానే సభలో రాహుల్ గాంధి, ప్రియాంక గాంధి, పార్టి అధ్యక్షలు మల్లిఖార్జున కర్గే ప్రసంగించారు.

యోగేంద్ర యాదవ్ తో పాటు మెహబూబా ముఫ్తీ, ఓమర్ అబ్దుల్లా మాట్లాడారు.

ఎమోషన్ అయిన రాహుల్ గాంధి

రాహుల్ గాంధి మాట్లాడుతూ హింసకు దేశంలో తావులేదన్నారు. కాశ్మీర్ తో సహాదేశంలో ఎక్కడా హింసకు బలైన వారి కుటుంబాలకు ఫోన్ల ద్వారా చావుకబుర్లు వినేపరిస్థితి రాకూడదన్నారు. హింసకు బలైన వారి కుటుంబ సబ్యుల భాదేంటో తాననుభవించానన్నారు. తన నానమ్మ తో పాటు తన తండ్రి హింసకు బలయ్యారని రాహుల్ గుర్తు చేసుకుని భావాద్వేగానికి లోనయ్యారు. ఈ పరిస్థితులు ఎవరికి రాకూడదన్నారు. హింస విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రేమను జోడిస్తూ దేశ వ్యాప్తంగా సాగిన యాత్ర తనకెంతో సంతృప్తి నిచ్చిందన్నారు. దేశాన్ని విచ్చిన్నం చేసే భావజాలం స్థానంలో ప్రేమ దుకాణం తెరిచానన్నారు. మతం మనుషులను ఏకం చేస్తుందని విడదీయదని రాహుల్ గాంధి అన్నారు.

తానెందుకు టీ షర్లులు ధరించాల్సి వచ్చిందో రాహుల్ గాంధి చెప్పారు. యాత్ర ప్రారంభంలో చాలా మంది పిల్లలు ఒంటి మీద చాలి చాలని వస్త్రాలతో పనులు చేస్తూ చలిని వణుకుతూ కనిపించారని ఆ భాధను తాననుభవించాలనే టీ షర్టులతో యాత్ర చేసానని అన్నారు. 

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి మాట్లాడుతూ విద్వేష రాజకీయాలు దేశానికి మేలు చేయవని అన్నారు. భిన్నత్వం కలిగిన దేశంలో హింసకు ఎప్పుడూ స్థానం ఉండబోదని అంతిమంగా హింస అంతమై ప్రేమ అందరిని ఐక్యం చేస్తుందన్నారు. రాహుల్ గాంధి యాత్ర ద్వారా ఓ క్రాంతి కిరణం వెలుగు చూసిందన్నారు.  తన సోదరుడి యాత్రకు సంఘీభావంగా దేశ ప్రజలు ఇండ్ల నుండి బయటకు వచ్చారని  అన్నారు.

మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ రాహుల్ యాత్ర సంకల్పం నెరవేరిందని  దేశంలో కొత్త వాతావరణం నెలకొందని అన్నారు. కన్యాకుమారి నుండి నడక మార్గం అంటే ముందుగా భయపడ్డామని కాని నడిచిన కొద్దీ దూరం తగ్గి గమ్యం చేరువైందని ఆయన రాహుల్ గాంధీని అభినందించారు. కశ్మీరి ప్రజల ఉదారతను ఖర్గే కొనియాడారు. ఉదారత అనేది కాశ్మీరియత్ గొప్పతనమన్నారు. బిజెపి ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలకు వ్యతిరేకంగా పేదవారికి బిజెపి పెంచి పోషింఛిన ధనంవతులకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. జన్నత్ అని పిలిచే  కాశ్మీర్ ను యూనియన్ టెరిటరి చేశారని తిరిగి రాష్ట్రంగా చేసేందుకు  శాయశక్తులా కృషి చేస్తామన్నారు.

మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ రాహుల్ గాంధీలో గాంధీని చూస్తున్నానని అన్నారు.  కాశ్మీర్‌లోని రాహుల్ తన ఇంటికి వచ్చారని జమ్మూ కాశ్మీర్ నుండి గాడ్సే భావజాలం నిర్మూలన జరగాలని గాంధి సిద్దాంతం వస్తుందని తాను ఆశిస్తున్నానని అన్నారు. రాహుల్ గాంధి దేశానికి కొత్త ఆశా కిరణమని అన్నారు. 

ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ రాహుల్ గాంధి యాత్ర విజయవంతమైందన్నారు. బిజెపిని ఇష్టపడే వ్యక్తులు ఉన్నట్లే  బిజెపిని విడిచిపెడుతున్న వారు ఉన్నారని బిజేపీకి భిన్నమైన ప్రభుత్వం అవసరమని అన్నారు. రాహుల్ ప్రయామం దేశానికి ప్రేమను సామరస్యాన్ని శాంతిని చాటిందని అన్నారు. 

వీడియో కోసం ఇక్కడ చూడండి


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు