చిల్లర రాజకీయాలు తిప్పి కొట్టాలే- బెబ్బులిలాగా తిరగ బడాలే - పాలమూరు సభలో కెసిఆర్

 


మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ కేంద్రం వైఖరిని నిల దీసారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు కొనసాగించారు. ప్రధానమంత్రి రాష్ట్రంపై కక్ష పూనారని ఆయన వల్ల  3 లక్షల కోట్లు నష్ట పోయామని సిఎం అన్నారు.

బీజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అభివృద్ధి అధ్వాన్నంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి నేరంద్ర మోది స్వంత రాష్ట్రం గుజరాత్ లో పరిస్థితి చెప్పుకుంటే ఇజ్జత్ పోతుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లు గడిచినా గుజరాత్ లో మంచినీటి కోసం జనం తపిస్తున్నారని అన్నారు. 24 గంటలు కరెంట్ కూడ ఉండదన్నారు. 

దేశ రాజధాని డిల్లీలో మంచి నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నీటి కోసం  గోతులు తీసుకుని అవస్థలు పడుతు ఎదురు చుస్తున్నారని అన్నారు. ధికారంలోకి ఉన్న రాష్ట్రాలలో ప్రజలను బాగు చేయడం చేత కాని పాలకులు తెలంగాణ లో అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వ లేక అడ్డం పడుతున్నారని  విమర్శించారు.


దండం పెట్టి కడుపులో తలకాయపెట్టి 150  దరఖాస్తులు తానే స్వయంగా ఇచ్చానని కృష్ణా నదిలో మా వాటా తేల్చమని అడిగితే  8 ఏండ్లుగా తేల్చలేదన్నారు.  నీళ్ళ వాటా తేల్చేందుకు ఇంతగా జాప్యం చేస్తే మనవళ్లు మునిమనవల్ల కాలానికి కూడ పరిష్కారం కాదని  ఎప్పటికి  వాటా నీళ్లు వాడుకోవాలని ప్రశ్నించారు. 


కేంద్రం అవలంబిస్తున్న  విధానాలపట్ల  రాష్ట్రంలో అందరూ చర్చ చేయాలన్నారు. కేంద్రం సహకరించక పోతే  రాష్ట్రంలో అభివృద్ధి సాద్యం కాదన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోది స్వయంగా పాలమూరును హం బనాయేంగే అన్నారని అభివృద్ది ఏమైందని కెసిఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ విషయంలో ఆనాడు తాను చెప్పింది నిజమైందన్నారు. ఈ రోజుదేశంలో ఏం జరుగుతుందో అర్దం చేసుకోవాలని అన్నారు.



రాష్ట్రం బాగు పడకుండా అడ్డంకులు కల్పించి అడిగితే ప్రభుత్వాన్ని కూల గొడతామని దేశ ప్రధాన మంత్రే స్వయంగా కెసిఆర్ నీ ప్రబుత్వాన్ని కూల గొడ్తానన్నారని కెసిఆర్ మండిపడ్డారు. ఏం కారమం చేత కూలగొడ్తారని ప్రశ్నించారు. ప్రధాన పశ్చిమ బెంగాల్ కు వెళ్లినపుడు మమతా బెనర్జి  నీ 45 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని ఓ ప్రధాన మంత్రి అనవచ్చా అని కెసిఆర్ ప్రశ్నించారు.

దేశంలో ప్రతీకార రాజకీయాలు అవలంబిస్తూ విద్వేష రాజకీయాలతో ప్రజలను చీలుస్తూ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలుస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడ కూల్చే కుట్ర చేసారని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వస్తే పట్టుకుని జైళ్లో పెట్టామన్నారు.

ఏది చేయడం చేత కాక ఉన్న వన్ని కార్పోరేటర్లకు అమ్మకానికి పెట్టారని ఈ విషయాన్ని అందరూ ఆలోచించాలని చిల్లర గాళ్ల రాజకీయాలను తిప్పు కొట్టాలని ఎక్కడో ఓ కాడ బెబ్బులిలాగా దెబ్బతీయాలన్నారు.  

దేశంలో ఎక్కడి నుండో తిరుగు బాటు కావాలని తెలంగాణ కోసం తెగించి కొట్లాడక పోతే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. 

తెలంగాణ ప్రజలంతా తనకు పర్మిషన్ ఇవ్వాలని తెలంగాణ ఎంతో కొంత బాగుపడిందని దేశం కూడ తెలంగాణ లెక్క బాగు పడాలంటే జాతీయ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. సర్వ శక్తులు ఒడ్డి దేశ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయాలని అందుకు రాష్ట్ర ప్రజలు గట్టిగా నిలవాలని  అన్నారు.

వీడియో మహబాబ్ నగర్ బహిరంగ సభ


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు