మునుగోడులో టిఆర్ఎస్ విజయం


 మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎట్టకేలకు విజయం సాధించింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ముప్పు తిప్పలుపడ్డా ఓటమి చవిచూసిన ట్ఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికల్లో   అధికార టిఆర్ఎస్ భారి అధిక్యత సాధించక పోయినా భారతీయ జనతా పార్టీపై విజయం సాధించామన్న తృప్తి ఆ పార్టి నేతలకు మిగిలింది.

మంత్రులు, ఎమ్మెల్యేలు కార్పోరేషన్ల చైర్మన్లు అందరూ మునుగోడులో 40 రోజుల పాటు కాంపులేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

బిజేజి కూడ ఎంతా చాలైంజ్ గా తీసుకుని గెలుపుకోసం చివరి వరకు పోరాడింది. ఆ పార్టి నేతలు విజయం గ్యారంటి అని భావించినా ఫలితం దక్క లేదు. మొదటి రౌండ్లలో బీజెపీకి ఆశాజనకంగా కనిపించినా ఆ తర్వాత టిఆర్ఎస్ కు ప్రతిరౌండ్ లో ఆధిక్యత లభించింది.

 ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో 14 రౌండ్ల అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజేతగా నిలిచారు. తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామమాత్రంగా నిలిచారు. 


14 రౌండ్ల అనంతరం కూసుకుంట ప్రభాకర్ రెడ్డికి 95,304 ఓట్లు రాగా, రాజగోపాల్ రెడ్డికి 85,157 ఓట్లు లభించాయి. మూడో స్థానంలో ఉన్న పాల్వాయి స్రవంతి 21,243 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత  2, 3వ రౌండ్ లోనే బీజేపీకి స్వల్ప అధిక్యత మినహా ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజ వేసింది. 


14వ రౌండ్ లో కూసుకుంట్లకు 6,608 ఓట్లు, రాజగోపాల్ రెడ్డికి 5,553 ఓట్లు లభించాయి. ఈ రౌండ్ లో టీఆర్ఎస్ 1,055 ఓట్ల ఆధిక్యం సంపాదించింది. మొత్తం 14 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కూసుకుంట్ల ఆధిక్యం 10,094 ఓట్లకు పెరిగింది.

మునుగోడు ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓట‌మిని చ‌వి చూసింది. క‌నీసం డిపాజిట్‌ను కూడా ద‌క్కించుకోలేక‌పోయింది. 15 రౌండ్ల‌లో ఏ ఒక్క రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించ‌లేదు. మొద‌టి నుంచి చివ‌రి రౌండ్ వ‌ర‌కు మూడో స్థానంలోనే ఉండిపోయింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆ పార్టీ అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతి రెడ్డి.. కౌంటింగ్ కేంద్రం నుంచి ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలోనే వెళ్లిపోయింది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు