షర్మిల అరెస్ట్ - పాదయాత్రకు బ్రేక్ - నర్సంపేటలో రణ రంగం

 


తెలంగాణ లో పాదయాత్ర చేస్తున్న వై.ఎస్ ఆర్ తెలంగాణ పార్టి అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల అతిగా ప్రవర్తించి తన యాత్రకు తానే భంగం కలుగ చేసుకున్నారు.

నర్సంపేటలో షర్మిల యాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెల కొనడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు

తెలంగాణ లో ఇప్పటి వరకు షర్మిల 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసారు

ఆమె గ్రామాలలో తిరుగుతూ ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ స్థానికులను ఆకుట్టుకునే ప్రయత్నాలు చేశారు.

అయితే తన ప్రసంగాలలో  అధికార పార్టి ఎమ్మెల్యేలపై విమర్శలు చేసే విదానంలో మాత్రం ఆమె ఆరోపణలు  కొంచెం అతిగా ఉంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

ఇక షర్మిల యాత్ర తెలంగాణ లో కొనసాగడం కష్టమని పరిశీలకులు భావిస్తున్నారు

 ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార టిఆర్ఎస్ పార్టి  వైఫల్యాలు ఉండవచ్చు కాని ఆంధ్ర నేతలు వచ్చి సోయి చెప్పాల్సినంతగా లేవని మా సమస్యలకు మేమే పరిష్కారం వెదుక్కుంటామని తెలంగాణ నేతలు తేల్చి చెబుతున్నారు

ఇక షర్మిల యాత్ర కొనసాగనిచ్చేది లేదని కూడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

షర్మిల యాత్ర సందర్బంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేందుకు షర్మిల చేసిన ప్రసంగమేనని చెబుతున్నారు

షర్మిల కారవాన్ ను ధగ్దం చేశారు. చెన్నారావుపేట మండలం లింగగిరి క్రాస్ రోడ్ వద్ద వైఎస్ షర్మిల ఆవిష్కరించిన వై.ఎస్ విగ్రహానికి నిప్పు పెట్టారు.

పరిస్థితులు ఉద్రిక్తకు దారి తీయడంతో పోలీసులు షర్మిలను ఆరెస్టు చేశారు.

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టిఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల యాత్రను కావాలనే అడ్డగించారు. 

వందలాది మంది టిఆర్ఎస్ పార్టి కార్యకర్తలు షర్మిల యాత్రను అడ్డగించి ఎమ్మెల్లే పెద్ది సుదర్శన్ రెడ్డిని అవమానపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. 

వై.ఎస్ఆర్ పార్టి కార్యక్తలకు టిఆర్ఎస్ కార్యకర్తలకు మద్య తోపులాటలతో ఉద్రిక్తకు దారి తీయడంతో పోలీసులు కలుగు చేసుకుని షర్మిలను అరెస్ట్ చేసారు.

పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠి చార్జి చేశారు

పెద్ది సుదర్శన్ రెడ్డి గతంలో ట్రాక్టర్  నడిపిన వ్యక్తి అంటూ నర్సంపేటలో జరిగిన రోడ్ షోలో విమర్శలు చేశారు.

 తన తల్లి విజయమ్మ సమక్షంలో షర్మిల ప్రసంగం చేశారు

ఒకప్పుడు ట్రాక్టర్ నడిపే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇప్పుడు వేల కోట్లకు ఎదిగిండు. భార్యాభర్తలిద్దరూ ఎమ్మెల్యేలట, ఇద్దరూ సంపాదిస్తారట. భూకబ్జాలట, పోస్టింగులకు కమీషన్లట. పంట నష్టపోతే కనీసం సాయం చేయని ఈ ఎమ్మెల్యే ఇక ఉండి ఎందుకూ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు స్థానికంగా టిఆర్ఎస్ కార్యకర్తలకు అగ్రహం కలుగ చేసాయి. 

షర్మిల తన పాద యాత్రలో ముఖ్యమంత్రి కెసిఆర్ ను  టిఆర్ఎఎస్ ఎమ్మేల్యేలను మంత్రులను  టార్గెట్ చేసి విమర్శలు చేయడం టిఆర్ఎస్ శ్రేణులకు పూర్తిగా నచ్చడం లేదు

ఆంధోల్ ఎమ్మెల్యే చంటిక్రాంతి కిరణ్ పై కూడ ఇట్లాగే విమర్శలు చేయడంతో ఆమెపై ఎస్సి ఎస్టి అట్రాసిటీస్ చట్టం కింద ఫిర్యాదు చేశారు.

పెద్దపల్లి ఎమ్మల్యే పై విమర్శలు చేయడంతో షర్మిల శిబిరాన్ని కొత్తూరులో ధ్వంసం చేసారు

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై కూడ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిపై కూడ విమర్శలు చేసారు

అట్లాగే బీజేపి నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ లపై కూడ షర్మిల విమర్శలు చేశారు.

కాంగ్రేస్ నేతలను కూడ వదిలి పెట్టలేదు.

వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా షర్మిల ను చూసేందుకు జనాలు వస్తున్నది వాస్తవం కావచ్చు

తన వద్ద పుష్కలంగా ఉన్న డబ్బులు జనాల కోసం షర్మిల ఖర్చు చేస్తున్నారనేది కూడ  నిజమే

షర్మిల అమాయకత్వం కాక పోతే తెలంగాణ ప్రజలు ఆంధ్రా పార్టీలకు ఆంధ్ర పార్టీల నేతలకు పదే పదే మోస పోవడం అనేది పాత రోజులు  

ఆ విషయం అర్దం కాక పాపం షర్మిల తెలంగాణ లో ఉన్న పార్టీలను కాదని తానే అధికారంలోకి రానున్నట్లు ప్రజల్లో భ్రమలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

జనం నుండి ఆమె ప్రసంగాలకు మంచి స్పందన ఉంటున్నదని ఎమ్మెల్యేలు మంత్రులపై విమర్శలు చేయడం తెలంగాణ వారికి నచ్చడం లేదు

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గతంలో ట్రాక్టర్ నడిపాడని మాట్లాడడం కించపర్చడం కాదా 

సుదర్శన్ రెడ్డి ట్రాక్టర్ నడిపాడో లేదో  ఎవరికి తెలియదు..ఒకవేళ నడిపితే  తప్పా అనేది షర్మిల జవాబు చెప్పాలి..షర్మిల దృష్టిలో కష్టం చేస్తే కూడ తప్పే అవుతుందా అనేది ప్రశ్న

ఇక అవినీతి అంటే వై.ఎస్ హయాంలో జరిగిన అవినీతి సంగతి ఏమిటి 

వేల కోట్ల ప్రజాధనాన్ని మింగేసి సర్కార్ ఖజానా ఖాళి చేసి తమ స్వంత ఖజానా నింపుకోవడమే కదా  

ఆ మాటకొస్తే ఈ రోజు షర్మిల తన యాత్రకు చేస్తున్న  ఖర్చు ఎక్కడిదో చెప్పాలి 

అసలు షర్మిలకు తెలంగాణ సమస్యలు ఏం తెల్సునని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. 

ఎవరో గాలిగాండ్లు గాలి ముచ్చట్లతో రాసిచ్చిన స్క్రిప్ట్ బట్టీ పట్టి అక్షరం పొల్లుబోకుండా  చదవడం తప్పితే షర్మిలకు  వాస్తవ పరిజ్ఞానం  ఉందా అని మండిపడుతున్నారు.

ఆంధ్రాలో నీ అన్న పాలన ఎట్లా ఏడ్చిందని తెలంగాణ ప్రాంతంపై పడ్డావుతల్లి అని ప్రశ్నిస్తున్నారు

తెలంగాణ ఉద్యమ సమయంలో తన అన్న జగన్ ఓదార్పు యాత్ర పేరిట మానుకోటకు వచ్చేందుకు ప్రయత్నించగా తెలంగాణ వాదులు రాళ్ల దాడితో తిప్పు కొట్టిన విషయం షర్మిల మరిచి పోవద్దని అంటున్నారు

మానుకోట రైల్వే  స్టేషన్ లో  రాళ్ళ దాడి చేసి కాంగ్రేస్ నాయకులను తరిమి కొట్టారు. 

పోలీసులు కాల్పులు జరిపినా ఆందోళన కారులు వెనుకాడ లేదు. 

దాంతో జగన్ ఓదార్పు యాత్ర అర్దాంతరంగా మద్యలో అగి పోయింది.

ప్రస్తుతం షర్మిల యాత్ర కూడ ఆమె రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగా మందుకు సాగని పరిస్థితులు నెల కొన్నాయి.

యాత్ర సందర్భంగా షర్మిల తెలంగాణాకు బద్ద వ్యతిరేకి అయిన తన తండ్రి విగ్రహాలు వరుసగా ఏర్పాటు చేయడం కూడ తెలంగాణ వారికి నచ్చడం లేదు


WATCH VIDEO

షర్మిలకు నర్సంపేటలో షాక్


https://youtu.be/z5HT1dYB6hA

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు