బేరాలన్న కెసిఆర్ - తేలాలన్న బిజెపి

 మోయినాబాద్ ఫాం హౌజ్ కేసు

ఇదో మిస్టరి కథ

టియ్యారెస్ ఎమ్మెల్యేలతో బిజెపి మద్యవర్తులుగా చెప్పుకున్న ముగ్గురు వ్యక్తులు సాగించిన బేరాలు

పథకం పన్ని దళారులను అడ్డంగా పట్టుకున్న తెలంగాణ సర్కార్ 

ఇప్పుడిదో హాట్ టాపిక్ గా మారింది

కేసు ఎంత వరకు న్యాయపరంగా నిలుస్తుందో తెలియదు

 కాని బిజేపీని బాగా బద్నామ్ చేయాలని సిఎం కెసిఆర్ ప్రయత్నించారని బీజేపి నేతలు మండిపడుతున్నారు. 

మునుగోడు ఎన్నికల సమయంలోనే ఈ వ్యవహారాన్ని తెరపైకితెచ్చి పార్టీని బ్లేమ్ చేసారని బీజేపీ నేతలు అగ్రహంతో ఉన్నారు

బీజేపి నేతలు వాదిస్తున్నట్లు టిఆర్ఎస్  ఈ వ్యవహారాన్ని మునుగోడు ఉప ఎన్నికల్లో మైలేజీ కోసం బాగా వాడుకుంది

చట్టపరమైన దర్యాప్తు సంస్థలు నిగ్గుతేల్చాల్సిన ఈ కేసులో స్వయంగా సిఎం కెసియారే దర్యాప్తు అధికారిగా మారారు

వీడియోల లీకులతో వ్యవహారం బాగా వైరల్ అయింది

ఇందులో న్యాయపరంగా ఉన్న అనేక ప్రశ్నలకు దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చాల్సి ఉందని  సిబిఐ లేదా సుప్రీం కోర్టు సిట్టింగ్ కోర్టు జడ్జి చేత విచారణ జరగాలని బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు

మొత్తానికి ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం రాష్ర్టంలో ఓ మిస్టరి సెన్సేషన్ కథను తలపింప చేస్తోంది.

ప్రజాప్రతినిధుల బేరాలు ఇలా సాగుతాయా అనే ప్రశ్నలు సామాన్యుల్లో తలెత్తుతున్నాయి

ప్రభుత్వాన్ని పడ గొట్టేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోది హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ పథకం పన్నారని సిఎం కెసిఆర్ నేరుగా వారిపై ఆటాక్ మొదలు పెట్టారు

ఏమైనా కానీయండి ఇక తేల్చుకుంటానంటూ ఈ వ్యవహారం సంగతేంటో చూస్తానంటూ సిఎం కెసీయార్ దేశంలో న్యాయమూర్తులందరికి ఈ వీడియోలు పంపినట్లు వెల్లడించారు

ఎమ్మెల్యేలతో మొయినాబాద్ ఫాం హౌజ్ లో మంతనాలు సాగించిన వారి  వీడియో టేపులు కెసిఆర్ మీడియా కాన్ఫరెన్సులో  బయటపెట్టారు

బిజెపి కిరాతక చర్యలకు పాల్పడిందని ప్రజాస్వామ్యం ఖూని చేస్తు ప్రజా ప్రభుత్వాలను పడగొడుతోందని కెసిఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు

బిజెపి ఆగడాలనుండి దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని న్యాయమూర్తులే కాపాడాలని కెసిఆర్ చేతులెత్తి వేడుకున్నారు

మరో వైపు ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై న్యాయస్థానాలలో విచారణ సాగుతోంది.

ఈ వ్యవహారంతో తమకు తమ పార్టి నేతలకు ఎలాంటి సంభందం లేదంటూ బిజెపి నేతలు కోర్టును ఆశ్రయించారు

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారంటూ తమ పార్టీ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది

ప్రస్తుతం టిఆర్ఎస్ బిజేపీ పార్టీల మద్యఈ కేసు రచ్చరచ్చగా మారింది.

ఇందులోవాస్తవాలు ఏ మేరకు ఉన్నాయో ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియదు

కెసిఆర్ కథ డెరెక్షన్ లో మొయినాబాద్ ఫాం హౌజ్ కథ నడిచిందన్ బిజెపి నేతలు ఇప్పటికే ఖండించారు

కెసిఆర్ వీడియో టేపులపై బిజెపి రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్ మాట్లాడుతూ ఈ మద్య ప్రధాని కావాలని కలలు కంటున్న కెసిఆర్ బిజెపి పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు

కెసిఆర్ ను ప్రజలు గద్దెదించే రోజులు దగ్గర పడ్డాయని ప్రజా వ్యతిరేకత పెరిగిపోవడంతో కొత్త డ్రామాలకు తెరలేపాడని విమర్శించారు

ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంతో సంభందం లేదని తమ పార్టి రాష్ర్ట అధ్యక్షులు బండి సంజయ్ గుళ్లో ప్రమాణం చేశారని తరుణ్ చుగ్ అన్నారు

కెసిఆర్ లో నిజాయితి ఉంటే ఎందుకు గుళ్లో ప్రమాణం చేసేందుకు భయపడుతున్నాడని ప్రశ్నించారు

కెసిఆర్ చేసిన పాపాలే కెసిఆర్ ను వెంటాడుతున్నాయని అందుకే ఆయనకు భయం పట్టుకుందని అన్నారు తరుణ్ చుగ్.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ చూపించిన వీడియోల్లో ఏమిలేదన్నారు

బ్రోకర్లద్వారా ఎవరూ పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకోరన్నారు

వంద కోట్లు కదా వంద పైసలకు కూడ ఆ ఎమ్మెల్యేలు విలువ చేయరన్నారు

ఫాం హవుజ్ ఘటనపై ప్రభుత్వం విచారణకు సిద్దంగా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు.

పార్టి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఫాం హవుజ్ డ్రామాలో ఎమ్మెల్యేలు ఆక్టర్లని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం కేసీఆర్ దని  పింకు పార్టి మీడియా పార్టనర్ అని ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు