భారత్ జోడో యాత్రలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు చేరుకున్న కాంగ్రేస్ పార్టి అగ్ర నేత రాహుల్ గాంధి హైదరాబాదీల ఆదరాభిమనాలు చూసి సంభ్రమాశ్చర్యాల అనుభూతులకు లోనయ్యారనడంలో అతి శయోక్తి లేదు.
సుదీర్ఘ కాలంగా తెలంగాణ స్వరాష్ర్టం కోసం సాగిన పోరాటాన్ని కాంగ్రేస్ పార్టి అధినేత్రిగా సోనియా గాంధి సాకారం చేసిన నేపద్యంలో ఆమె తనయుడు రాహుల్ గాంధి భారత్ జోడో యాత్ర చేపట్టి తెలంగాణ రాష్ర్ట రాజధాని హైదరాబాద్ లో అడుగుపెడుతున్నారని అనేక వర్గాల ప్రజలు ఆయనకు స్వచ్చందంగా స్వాగతం పలికారు.
హైదరాబాద్ లో రాహుల్ గాంధీకి మామూలు స్వాగతం లభించ లేదు.
నగర పొలిమేరలకు తెల్లవారు జామునే చలిని లెక్కచేయకుండా జనం తరలి వెల్లి స్వాగతం పలికారు.
రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన వారిలో కేవలం కాంగ్రేస్ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు మాత్రమే కాదు కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు భిన్న రాజకీయ అభిప్రాయాలు కలిగిన వారు రాహుల్ గాంధీని స్వాగతించారు.
చారిత్రక గమనంలో అనేక ఘర్షణలను తన జ్ఞాపకాల్లో మిగుల్చుకున్న హైదరాబాద్.
ప్రపంచంలో ఓ ప్రత్యేక మైన సంస్కృతిని చాటుతున్న హైదరాబాద్
రాహుల్ గాంధి తాత జవర్ లాల్ నెహ్రూ మాటల్లో హైదరాబాద్ ఓ మిని ఇండియా
దక్కన్ కా దిల్ కా ధడ్కన్ హైదరాబాద్
గంగా జమున తెహజీబ్ ఇది
రాహుల్ గాంధి భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ర్టంలో ప్రవేశించినప్పటి నుండి అఖండ స్వాగతం లభించింది.
అయను చూసేందుకు ఆయన చేపట్టిన సంకల్పానికి సంఘీభావం తెలిపేందుకు అనేక మంది స్వచ్చందంగా తరలి వచ్చి అయన అడుగులో అడుగులు వేసి హమ్ తుమ్హారే సాత్ హై అంటూ చేతిలో చేయి వేసి చెప్పిన భాషలు అవే రాహల్ కు కావాల్సిన కొండంత అండదండలు.
రాజేంద్ర నగర్ నుండి రాహుల్ పాత బస్తి గుండా చారిత్రక చార్మినార్ చేరే వరకు జనమే జనం
భాదాతత్పహృదయాలను గుండెకు హత్తుకుని ఓదార్చిన రాహుల్ గాంధి
పిల్లలతో కలబోసి కల్లా కపటంలేని హృదయం చాటుకున్న రాహుల్ గాంధి
కష్టసుఖాలు తెల్సుకుని కన్నీటి ధారలు తుడిచి ఓదార్చిన రాహుల్ గాంధి
విశ్వ విద్యాలయ ప్రాంగణంలో వివక్షకు బలైన రోహిత్ వేముల మాతృవేదనను చూసి తల్లడిల్లిన రాహుల్ గాంధి
జనమే జనం ఎవరిని ఆపలేని శక్తి
ఎవరిని నిలువరించలేని బందోబస్తు
సెక్యూరిటి చేధించి దూసుకువచ్చే జన ప్రభంజనం
అదుపు చేసేందుకు భద్రతా వలయాల ముప్పు తిప్పలు
ఇవన్ని రాహుల్ గాంధి భారత్ జోడో యాత్రలో సన్నివేశాలు
చారిత్రక హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టిన చేరుకున్న రాహుల్ గాంధి చార్మినార్ లో ఆతర్వాత నక్లెస్ రోడ్ లో నగర వాసుల నుద్దేశించి ప్రసంగించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box