వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్ - మహిళల అగ్రహం

 


మహిళలనుద్దేశించి యోగా గురు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా అగ్రహం వ్యక్తం అవుతోంది

బాబారాందేవ్ వ్యాఖ్యలపై మహిళలు మండిపడుతున్నారు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమని అమృతా ఫడ్నవిస్ సమక్షంలో రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే  కూడ ఆ సమయంలో అక్కడే ఉన్నారు

పతంజలి యోగా పీఠం, ముంబై మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తాధ్వర్యంలో మహారాష్ర్ట లోని థానేలో యోగా సైన్స్ శిబిరం జరిగింది

నాకంటికి అయితే నాలాగా మహిళలు అసలు ఏమి ధిరంచక పోయినా అందంగా ఉంటారంటూ బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు

ఉదయం యోగాశిబిరం ఆ తర్వాతే మహిళల సదస్సు  ఉండడంతో ముందుగా మహిళలు సెల్వార్ సూట్ లు ధరించి యోగా శిబిరంలో పాల్గొన్నారు.

డ్రెస్ లు  మార్చుకునే అవకాశం లేక ఆ తర్వాత మొదలైన మహిళల సదస్సులోపాల్గొనేందుకు అట్లాగే ఉండి  పోవడంతో రాందేవ్ బాబా ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు,

చీరలు కట్టుకునే సమయం లేక పోయింది 

సమస్యేమి లేదు ఇండ్లకు వెళ్లి చీరలు కట్టుకోండి

మహిళలు చీరల్లో అందంగా కన్పిస్తారు. 

సల్వార్ సూట్స్‌లో కూడా బాగుంటారు. 

నా కంటికైతే అసలేమీ ధరించకపోయినా నాలాగే అందంగా కన్పిస్తారని బాబా రాందేవ్ నోరు జారారు

శిబిరంలో పాల్గొన్న  మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవిస్ సతీమని అమృతా ఫడ్నవిస్ సహా  అనేక మంది మహిళలు సదస్సులో ఉన్నారు

ఆసమయంలో బాబా రాందేవ్ వ్యాఖ్యల పట్ల ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు

ఎందుకంటే యోగాగురువు బాబారాందేవ్ పట్ల ఉన్న గౌరవంతో మహిళలు నవ్వి ఊరుకున్నారు

కాని ఆ తర్వాత దేశవ్యాప్తంగా మహిళలు బాబారాందేవ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు

మహిళా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

బాబారాందేవ్ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు

గతంలో అనేక మార్లు బాబా రాందేవ్ వివిద సందర్బాలలో  వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అవమానాల పాలయ్యారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు