భారత దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుపుకున్నాం. ఖండాతరాల్లో పలు దేశాలలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయులు సైతం ఈ ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు.
అమెరికా లో ఉన్న భారతీయుల గురించి దేశం గర్వించే రీతిలో ది యుఎన్ఎన్ (THE UNIVERSAL NEWS NETWORK) లో ప్రత్యేక వార్త కథనం వెలువ రించారు. అందులో భాగంగా ప్రముఖ వైద్యుల సందేశాలు జత చేసారు.
తెలుగు అనువాదం చదవండి...(Translated by Dr Manduva prasada Rao- 9963013078)
2021లో అమెరికా అధ్యక్షుడు జోబిడెన్, నాసా మార్స్ కు పంపిన వ్యోమనౌక అక్కడ సురక్షితంగా దిగేందుకు కావలసిన సాంకేతికతను ప్రత్యక్షంగా పర్యవేక్షించినటువంటి స్వాతి మోహన్ కు ఫోన్ చేసి "భారత మూలాలున్న అమెరికన్ పౌరులైన మీరు, నా వైస్ ప్రెసిడెంట్ , నా స్పీచ్ రైటర్, వినయ్ అంతా ఈ దేశాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు" అని ప్రశంసించారు.
అమెరికాలో భారతీయులు సాధించిన ఘనత అధ్యక్షుడు జోబిడెన్ అభిప్రాయాల్లో వ్యక్తం అయింది. ఈ దేశంలో కీలక రంగాలైనటు వంటి ఐటీ రంగంలో ఎంతో మంది సీఈవోలు భారతీయులు. ఎంతో తీవ్రమైన పోటీ ఉండేటువంటి రాజకీయాల్లో కూడా శాసనసభ్యులుగా కాంగ్రెస్ లో ఎన్నో స్థానాలని పొందగలిగారు. విద్యా, వైద్య, సాంకేతిక, మీడియా రంగాలలో అత్యంత ప్రశస్తమైనటువంటి ఉన్నత స్థాయిలు అధిరోహించడమే కాకుండ, భారతీయ ప్రవాసులు ఒక విస్మరించలేని ప్రత్యేక గుర్తింపును సాధించగలిగారు.
అమెరికా జనాభాలో ఈ ప్రవాసులు 38 లక్షలతో దేశ జనాభాలో 1.2 శాతం ఉన్నారు. ఈ ప్రవాసులలో చాలా కాలం నుండి ఇక్కడ స్థిరపడ్డ వారితో పాటు ఇంకా కొత్తగా వచ్చిన వారు అని వీరు రెండు రకాలుగా ఉండి ద్వివర్ణ ఇంద్రధనస్సుగా వెలిగి పోతున్నారు. ప్రవాసులలో 75% మంది 1990 తర్వాత అమెరికాకు వచ్చిన వారే. వీరంతా ఉన్నత విద్యావంతులు, సంపన్నులే కాకుండా ఎన్నో రంగాల్లో కలిసికట్టుగా వారి ప్రత్యేకతను నిలుపుకునే విజయాలు సాధించారు. తమ ప్రఙా పాటవాలలో అమెరికా నిజ వాసులను అధిగమించి అనేక రంగాల్లో దూసుకు వెళ్లారు. అమెరికాలో నివసించే అన్ని దేశాల ప్రవాసులలో అగ్ర గన్యులుగా నిలిచారు.
వారి విద్య,వైఙ్ఞానిక, నైపుణ్యాలలో నూతన ఆవిష్కరణలకు ఆలవాలంగా నిలిచి తాము ఎంచుకున్న దేశాన్ని ప్రపంచంలో అత్యున్నత దేశంగా, ఇతర దేశాలకు నమూనాగ, ప్రపంచ నాయకత్వం వహించగల దేశంగా తీర్చిదిద్దేందుకు వారి వంతు సేవలందించారు.
కుటుంబ విషయాల పరిశోధనా సంస్థ(ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ స్టడీస్) ప్రకారము భారతీయులు ఇతర దేశాల్లో మూలాలున్న వారందరి సంఖ్యతో పోలిస్తే 2వ స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో మెక్సికో ఉంది. 25 నుండి 55 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయుల మధ్యస్థ ఆదాయం సంవత్సరానికి కోటి ఆరు లక్షల పై చిలుకుంటే అమెరికన్ల ఆదాయం 68,9600 రూపాయల పై చిలుకు ఉంది.
విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం జో బిడెన్ కమల హారిస్ ప్రభుత్వంలో 130 మంది భారతీయులు వివిధ ప్రభుత్వ శాఖలలో అత్యంత ఉన్నత స్థాయిలో పనిచేస్తూ ఉన్నారని కొన్ని ముఖ్యమైన శాఖలలో వారిదే ఫై చేయని తెలుస్తోంది.
"కమల హరీస్ అండ్ రైసింగ్ అమెరికన్ ఇండియన్స్" అనే తన పుస్తకంలో "తరుణ్ బాసు" ఈ విధంగా రాశారు "ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుండి మామూలు విద్యాబుద్దులతో ఒక అత్యంత ధనిక దేశం అయిన అమెరికాకు వచ్చి ఉన్నత విద్యను అభ్యసించి ఆ దేశంలో అత్యంత ఆదాయం కలిగినటు వంటి ప్రవాసులుగా ఒకే తరంలో ఘనత కెక్కడం శ్లాఘనీయంగాను స్ఫూర్తిదాయకంగాను ఉంది."
ఎన్నో దేశాల నుండి ఈ దేశానికి వచ్చిన రకరకాల జాతి ప్రజల్లో ఒక్క భారతీయులే అత్యున్నత స్థాయికి ఎదగడానికి కారణాలు ఏమైయుంటాయి అనే కుతూహలంతో నేను నాకు తెలిసిన చాలామంది భారతీయ ప్రవాసుల్ని అడిగాను.
అరుణ్ వేణుగోపాల్ తన అట్లాంటిక్ అనే పుస్తకంలో భారతీయుల ఉన్నతికి కారణాన్ని ఈ విధంగా విశ్లేషించారు " పౌర హక్కుల ఉద్యమం తర్వాత ప్రజలకు చాలా అవకాశాలు పెరిగాయి. ఈ ఉద్యమంలో పాల్గొన నప్పటికీ ఆ ఉద్యమం తర్వాత పెరిగిన అవకాశాలను విద్యాధికులైనటు వంటి అప్పుడే వచ్చిన భారతీయులు నగరాలు, చిన్న చిన్న పట్టణాలనే వ్యత్యాసం లేకుండా ఎక్కడికైనా పోయి కష్టపడ్డారు. అంతేకాకుండా... "తెల్లవారు"... వారితో పాటు ఇతర జాతుల కన్నా భారతీయులను అమెరికన్లు ఎక్కువగా ఆదరించారు
సంజయ్ చక్రవర్తి, దవేష్ కుమార్ తో పాటు నిర్వికార్ సింగ్ కలిసి రాసినటువంటి " ది అదర్ వన్ పర్సెంట్: ఇండియన్స్ ఇన్ అమెరికా" అనే పుస్తకంలో విదేశంలో ఏదైనా ఒక జాతి విజయం సాధించేందుకు కారణాలను ఈ విధంగా తెలిపారు.
ఇవి మన భారతీయులకు వర్తిస్తాయి. "తమది కాని దేశంలో వలసదార్ల విజయం ముఖ్యంగా వారి సామర్థ్యాలు, వారి యొక్క పరిమితుల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వారి విజయాలకు కారణాలు వారు పుట్టి పెరిగిన దేశాల యొక్క సాంస్కృతిక అలవాట్లు గాని లేక సంస్కృతి ప్రభావం కన్నా వారి సాంఘిక ఆర్థిక స్తోమతలపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది."
మాస్ మ్యూచువల్ అనే ఒక పరిశోధన ప్రకారం భారతదేశంలో విద్యార్థుల యొక్క చదువు, వారి లౌకిక పరిపక్వత, వారు ఒక మంచి ఉద్యోగంలో చేరడంలో వనరులు సమకూర్చడంలో తల్లిదండ్రులు తమ సంపూర్ణ బాధ్యతగా స్వీకరిస్తారు. ఈ దిశగా కుటుంబ నడవడి ఉంటుంది. ఈ పరిస్థితులలో పెరిగినటు వంటి విద్యార్థులు సాధారణంగా అంతే బాధ్యతగా కష్టపడి అదే స్ఫూర్తితో ముందుకు సాగాలనే తపన కలిగి ఉంటారు. అందుకోసమే భారతీయ విద్యార్థులు విజయం సాధించేందుకు ఇలాంటి పరిస్థితులు దోహదపడుతుంటాయి.
ఈ కుటుంబ వ్యవస్థ, అది అందించిన విలువలు, తల్లిదండ్రులు నిస్వార్ధంగా అందించినటు వంటి ఆర్థిక మరియు మనో స్తైర్యం ఇవన్నీ కూడా భారతదేశం యొక్క కుటుంబ మరియు సాంఘిక పరిస్థితుల యొక్క ప్రభావం అనేది నిర్వివాదంశం. ఈ అనుకూల పరిస్థితులలో పెరిగి స్ఫూర్తి పొందడం వల్లనే అమెరికాకు వచ్చి భారతీయులందరు ఘనత సాధించారు. అందుకే 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలో ఉన్న భారతీయులం మేమంతా భారతదేశానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.
Ajay Ghosh
Chief Editor, www.theunn.com
----------------------------------------------------------------------------------------------------------------------------
సందేశాలు
వరంగల్ ఉమ్మడి జిల్లా (ములుగు జిల్లా కేంద్రం) కు చెందిన డాక్టర్ కత్తుల సతీష్ అమెరికాలో స్థిరపడిన ప్రవాసీ భారతీయుడిగా ప్రముఖ అంకాలజిస్టుగా క్లినికల్ ప్రొఫెసర్ గా ఖ్యాతి గడించాడు. అయన సందేశం...
Satheesh Kathula, MD, FACP; Clinical Professor of Medicine; Vice President, AAPI (AAPI-American Association of Physicians of Indian Origin (AAPI), the largest ethnic medical organization in the US.)
గత 75 ఏళ్లలో భారతదేశం సాధించిన దానికంటే రాబోయే 25 ఏళ్లు కీలకం!
1.4 బిలియన్ల జనాభా ఉన్న దేశంగా ఈ 75 ఏళ్లలో భారతదేశం సాధించినది ప్రశంసనీయం. అనేక సవాళ్లు సమస్యలు ఉన్నప్పటికీ భారతదేశం స్వతంత్ర దేశంగా, అతిపెద్ద ప్రజాస్వామ్యం మరియు ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.
స్వాతంత్య్రం అనంతరం మొదటి 25 సంవత్సరాలలో దేశ విభజన కారణంగా పొరుగు దేశాలతో జరిగిన యుద్ధాలతో నిలదొక్కుకోవడానికి పోరాడింది. తరువాత 25 సంవత్సరాలలో భారతదేశం టెలికమ్యూనికేషన్స్ తో పాటు విస్తృతమైన ఆర్థిక సంస్కరణలు మరియు అంతరిక్ష పరిశోధనల పరంగా భారీ పురోగతి సాధించింది. గత 25 ఏళ్లలోఐటి రంగం బూమ్, ఫార్మా ఎగుమతులలో గణ నీయమైన వృద్ధిని సాధించి అణు శక్తిలో బలీయమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. భారతీయ సంగీతం మరియు బాలీవుడ్ సినిమాల సాంస్కృతిక ప్రభావం ప్రపంచమంతటా వ్యాపించింది. ముఖ్యంగా క్రికెట్‌తో పాటు క్రీడల్లోనూ భారత్ తనదైన ముద్ర వేసింది.
భారతదేశం ఇప్పటివరకు సాధించినది అద్భుతమే అయితే రాబోయే 25 ఏళ్లు అన్ని రంగాలలో రాణించడం చాలా కీలకం. భారతదేశం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, గ్రామీణ మరియు ఆరోగ్య సంరక్షణపై మరింత దృష్టి పెట్టాలి. నూతన ఆవిష్కరణలకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని అందించి ప్రతిభకు ప్రోత్సాహకాలు ఇచ్చి అవినీతిని నిర్మూలనపై దృష్టి సారించాలి.
----------------------------------------------------------------------------------------------------------------------------
గత సార్వత్రిక ఎన్నికల్లో 75 కోట్ల మంది మండుటెండ డలో నిలబడి కొత్త ప్రభుత్వాన్ని శాంతియుతంగా ఎన్నుకున్నారు. మళ్లీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టినటువంటి మోడీ ఆగస్టు 15వ తారీకు స్వతంత్ర దినోత్సవం నాడు దేశం సాధించినటువంటి ప్రగతికి గర్వ పడుతుందని చెబుతూనే, ఇంకా దేశంలో చాలా సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా లంచగొండితనం ఆశ్రితపక్షపాతము, బంధుప్రీతి,వంశపారంపరానుగత అధికార మార్పిడి లాంటి సమస్యల్ని ఎత్తిచూపాడు. ఈ సందర్భంలో మహా న్యాయ కోవిదుడు, నాని పాల్కివాలా మన తిరంగ జెండాపై చేసిన ఒక వ్యాఖ్యానం గుర్తొస్తుంది. దేశమంతా నల్ల, ఎరుపు మరియు సింధూర వర్ణ పతాకం ఎగురుతుందని అందులో నలుపు నల్లదనానికి, ఎరుపు పరిపాలనలో ఆలస్యం అసమర్థతకు, సింధూర వర్ణం లంచగొండితనానికి ప్రతీకలని పేర్కొన్నాడు.
మన దేశంలో మంచి విద్య, నైపుణ్యాలతో ఉన్నటువంటి 54 కోట్ల 35 సంవత్సరాల వయసులోపు యువత దేశ ప్రగతి కోసం వారి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని దేశం సమర్ధవంతంగా వాడుకోవట్లేదని చెప్పేందుకు నేను వెనక ముందు ఆడటం లేదు. భారతదేశ చట్టాంగం దేశాన్ని ఒక అవకాశాల నిధిగా మార్చాలని ఆశిస్తే, మన నాయకులు దాన్ని ఒక అవకాశవాదంగా మార్చుకున్నారు. అవకాశాలు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలంటే భారత ప్రభుత్వం మరియు వ్యాపారస్తుల మధ్యన చక్కటి సహకారం ఉండాలి. మాటల్లో కాకుండా చేతల్లో వీరి యొక్క సహకార స్ఫూర్తి అనేది ప్రస్ఫుటం కావాలి.
దేశాన్ని పీడిస్తున్న బీదరికం ఇక రోగమైన, నయం చేయలేనిది కాదు. దేశ ప్రగతికి మానవ వనరులు, ప్రాకృతిక వనరులు మరియు వీటిని సమర్థవంతంగా వాడుకునే దృఢ నిశ్చయం కావాలి. మొదటి రెండు ఈ దేశంలో ఉన్నప్పటికీ మూడవది తగినంత స్థాయిలో లేదనేది నిజం. దేశంలో ప్రతి ఒక్కరికి ప్రగతి సాధించాలనే కోరిక ఉంది కానీ తగిన కార్యదీక్ష లేదు. ఇది దృక్పదలోపం. దీన్ని సరి చేస్తే సరిపోతుంది.
భారతదేశంలో ప్రజలకు ఉన్న ఆరోగ్యం హక్కు అమెరికాలో కూడా లేదు. భారత ప్రజలంతా మాకు విద్య ఇవ్వండి ఆరోగ్య ఇవ్వండి మేమే దేశాన్ని ప్రగతి పదాల్లో నడిపిస్తాంమని చాలా ఓపిగ్గా ఎదురుచూస్తున్నారు.
ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున నేను భారతీయ ప్రజలందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు అందజేస్తున్నాను జైహింద్.
K. Raju, MD, FRCS, FACS; Ophthalmologist, Regional Eye Associates
President and Founder, Eye Foundation of America; Goutami Eye Institute
Clinical Professor, Author: Musings on Medicine, Myth, and History-India’s Legacy
---------------------------------------------------------------------------------------------------------------------------
ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గుర్తింపు గౌరవం దక్కింది
నేను 1976లో అమెరికాకు వచ్చినప్పుడు ఇక్కడ సమాచార రంగంలో భారతదేశం గురించి ఏమాత్రం ప్రస్తావన ఉండేది కాదు. భారతదేశం అంటే ఇక్కడ మురికి వాడలు, పాములాడించే వాళ్ల గురించి, సన్యాసుల గురించి తెలుసు. దేశమంతటా జపాన్ గురించి విపరీతమైనటువంటి ప్రచారం జరిగేది. జపాన్ యొక్క సోనీ టీవీలు టయోటా కార్లు వారు సాధించినటువంటి నమ్మశక్యంగానే ఆర్థిక ప్రగతి గురించి విపరీతంగా కథనాలు వచ్చేటివి. అమెరికాలో ఉన్న జపానీల గురించి చర్చ జరిగేది. భారతదేశంలో కూడా జపాన్ దేశం లాగా మన్నన పొందితే కానీ గుర్తింపు పొందితే గాని భారతీయులకు ఇక్కడ వారి వ్యక్తిగతంగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ కూడా ఆ గౌరవం దక్కదనేది నాకు అర్థం అయింది.
లక్ష డాక్టర్ల సభ్యత్వంతో ఉండి భారత మూలాలు గల అమెరికన్ డాక్టర్ల అసోసియేషన్కు నేను అధ్యక్షునిగా పని చేశాను. అమెరికా ఆరోగ్య వ్యవస్థలో భారతీయ డాక్టర్ల పాత్ర ప్రశస్తమైనది. ప్రతి ఎనిమిది మంది అమెరికన్లలో ఒకరికి భారతీయ డాక్టర్లు వైద్య సేవలు అందించే స్థాయికి భారతీయులు ఎదిగారనే విషయంపై నేను గర్విస్తున్నాను. ఇది ఒక గొప్ప విజయం.
గత కొంతకాలంగా భారతీయులు అమెరికాలో కంప్యూటర్, విద్యా మరియు ప్రభుత్వ రంగాల్లో చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు. స్వాతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల్లో భారతదేశం విద్యారంగంలో ఆర్థిక రంగంలో మరియు సాంకేతిక రంగాల్లో ప్రపంచం మెచ్చదగ్గ ఘనత సాధించింది. ఇప్పుడు భారతదేశం అమెరికాలో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు భారతీయులకు ఇక్కడ ఎంతో గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి.
మేమంతా మేము ఎంచుకున్న రంగాలలో ఉన్నతి సాధించేందుకు కావలసిన వసతులు కల్పించిన మా జన్మభూమి అయిన భారతావానికి మరియు మా సామర్థ్యాన్ని సమర్ధవంతంగా వాడుకునేందుకు అవకాశాలు ఇచ్చిన అమెరికాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
నా అభిప్రాయాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు.
Ranga Reddy, Past President, AAPI
-----------------------------------------------------------------------------------------------------------------------------
75 సంవత్సరాల ఇండియా ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. భారతదేశం వైవిధ్యంలో ఐక్యతకు ప్రతీక. ప్రజాస్వామ్యం ఫరిడవీళ్ళుతున్న దేశం. దేశంలో ప్రతి పౌరునికి మత స్వేచ్ఛ ఉండి సంపూర్ణంగా అనుభవిస్తున్నాడు. విద్యా, నూతన విధానాల సృష్టి, ఆటలు ఇతర ఎన్నో రంగాల్లో నవ నవొన్వేషమైనటువంటి ఆకాంక్షలతో అధిక సంఖ్యలో యువకులు కలిగియున్న దేశం. అత్యంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉండి ప్రపంచ దేశంలో ఒక శక్తిగా పరిగణించబడుతున్న దేశం.
Jayesh Shah, Past President, AAPI
---------------------------------------------------------------------------------------------------------------------------
సురేష్ రెడ్డి ఏ ఏ పి పి మాజీ అధ్యక్షులు
భారతదేశం ఈ మధ్యకాలంలో మెల్లమెల్లగా తన యొక్క ప్రభావాన్ని ప్రపంచ దేశాల్లో పెంచుకుంటూ పైకి పైకి వెళ్తుంది. భారతదేశం ఒక అగ్రరాజ్యంగా మారేందుకు కావలసినటువంటి సంభావ్య శక్తి కలిగి ఉంది.
భారతదేశం తన సంపూర్ణ సంభావ్య శక్తిని సాధించేందుకు కావాల్సిన మానవ వనరులు అధిక సంఖ్యలో ఉన్న యువత రూపంలో మరియు ఇతరులకు భౌతిక వనరుల రూపంలో ఉన్నాయి. కానీ అది సాధించేందుకు చాలా మార్పులు అవసరం. ముఖ్యంగా దేశంలో మౌలిక వసతులు యొక్క లేమి చాలా ఉంది. దాని కారణంగా అటు వ్యాపార మరియు పారిశ్రామిక రంగాల అభివృద్ధి తగినంతగా చెందలేకపోవడం మరియు వాటి ప్రభావం దేశీయ ఉత్పత్తి రంగంపై మరియు విదేశీ పెట్టుబడుల పై పడుతుంది.
భారతదేశం లో ఉన్న అన్ని భాషలు మాట్లాడే ప్రజలకు, అన్ని ఆర్థిక తరగతుల ప్రజలకు,, అన్ని ప్రాంతాల ప్రజలకు, అన్ని మతాల ప్రజలకు సమాన అవకాశాలు ఇచ్చి సమంగా చూడబడి వారి సామర్థ్యాన్ని సంపూర్ణంగా వాడుకోబడినటువంటి దేశాన్ని నేను చూడాలని ఆశిస్తున్నాను. దేశంలో ప్రతి పౌరునికి సమాన గౌరవం, స్వేచ్ఛ ఇవ్వబడి వారి యొక్క సామర్ధ్యాన్ని సంపూర్ణంగా వాడుకొని ప్రపంచంలో ఉన్నత స్థాయికి చేరాలని, చేయగలదని కూడా ఆశిస్తున్నాను.
Suresh Reddy, Past President of AAPI; President of IAMA; Trustee of Oak Brook Village, IL
-----------------------------------------------------------------------------------------------------------------------------
భారతదేశ ఆధ్యాత్మికలో,విద్, వైద్య, శాస్త్ర సాంకేతికతలో వ్యాపారంలో, చలనచిత్ర, సంగీత మరియు చివరకు సుగంధ ద్రవ్యాల రంగాలలో ప్రపంచ పటంలో చెక్కుచెదరని ముద్ర వేసింది. అందుకే భారతదేశం శక్తివంతమైంది.
ఇండియా యొక్క అభివృద్ధి అపరిపక్వతలో ఉంది. ఇది అధికమించగలిగితే భారతదేశం అగ్ర రాజ్యాంగ త్వరలోనే కాగలదు.
ఏ రంగాల్లో కొన్ని లొసుగులున్నాయో వాటిని ఎలా అధికమించాలి అవి అమెరికాలో ఉన్న భారతీయులందరికీ తెలుసు.
భారతీయ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది. అది కొన్ని షరతులకు లోబడి అభివృద్ధి సాధించవచ్చు. కానీ దానికి భారతీయులు, ప్రవాస భారతీయులు పౌరులు అందరు కూడా అలాంటి ఉన్నతమైన భారతీయ అభివృద్ధికి కర్మ వీరులుగా పని చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అంటే ప్రతి ఒక్కరూ తన సంఘం కోసం, తన దేశం కోసం, ప్రపంచం కోసం తాను చేసే ప్రతి పనిం శ్రేయస్కరమని భావించి చేయాలి.
ఈ మహత్తర చారిత్రాత్మకమైన వేళ సుభాష్ గై యొక్క పరదేశి సినిమాలోని ఏ మేర ఇండియా ఐ లవ్ మై ఇండియా అనే పాట పాడుతూ ముగిస్తాను
TIRLOK MALIK, Emmy Nominated Filmmaker | Happy Life Yoga speaker; Ayurveda Ambassador
----------------------------------------------------------------------------------------------------------------------------
Lokesh Edara, MD, Chair, AAPI Global Medical Education; Assistant Professor of Medicine; Past President of GMCANA & Calhoun County Medical Society
----------------------------------------------------------------------------------------------------------------------------
డాక్టర్ సుజిత్ ఆర్ పున్నం
కార్డియాలజిస్ట్ అంటార్ప్రెనార్, థాట్ లీడర్
75 వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం భారతీయులందరికీ అత్యంత గర్వకారణమైనటువంటి క్షణం. అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో 30 సంవత్సరాల లోపు ఉన్న సగం జనాభాతో భారతదేశం చాలా సాధించింది. ఈ నేపథ్యంతో భారతదేశం వచ్చే 25 సంవత్సరాల్లో గత 75 సంవత్సరాలలో సాధించిన ప్రగతి సాధించగలదు. ముందున్న కాలంలో భారతదేశం ఎదుర్కోబోయే సమస్యలు ముఖ్యంగా లంచగొండితనం నిర్మూలన, గ్రామీణ అభివృద్ధి మరియు యువతకు ఉత్పాదక నైపుణ్యాలు కల్పించడం. అమెరికాలో నివసిస్తున్న భారతీయులందరికి రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాలైన భారత్- అమెరికా దేశాల మధ్య గత రెండు దశాబ్దాలుగా ఏర్పడిన బంధం వేడుకగా జరుపుకోవాల్సిన అంశం.
Dr. Sujeeth R. Punnam, Cardiologist, Entrepreneur and Thought Leader
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box