వీరు మామూలు దొంగలు కాదు

అత్యంత ఖరీదైన లగ్జరి కారు దొంగిలించి ఖండాంతరాలు దాటించారు

ట్రాకింగ్ సిస్టం తో దొరికి పోయారు


వీరు మామూలు దొంగలు కాదు. అత్యంత ఖరీదైన కారును దొంగిలించి ఖండాంతరాలు దాటించి అమ్మేసుకున్నారు. కాని చిన్న పొరపాటు కారణంగా దొరికి పోయారు. కొద్ది రోజుల క్రితం లండన్ లో ఓ ఇంటి ముందు పార్కు చేసి ఉన్న ఆదునిక హంగులు కలిగిన కారును దొంగిలించారు ఈ కారు అత్యంత విలాస వంతమైన బెంట్లీ ముల్సాన్నే లగ్జరీ కారు. దీని ఖరీదు సుమారు 6 కోట్లు ఉంటుందని అంచనా. కారు పోయిందని యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు యూకే నిషనల్ క్రైమ్ ఏజెన్సి  విచారణ చేపట్టింది. కారులో సీక్రెట్ గా ఉండే ట్రాకింగ్ సిస్టం ను ట్రేస్ చేస్తే ఆ కారు పాకిస్తాన్ లో ని కరాచీలో ఉన్నట్లు  గుర్తించారు. యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ అధికారులు కరాచీ లోని  కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కలెక్టరేట్ అధికారులకు కారు వివరాలు అంద చేసారు. కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ కలెక్టరేట్ అధికారులు కరాచీలో ఉన్న బెట్లీ కారును కనుగున్నారు. అప్పటికే కారు నంబర్ ప్లేట్ మార్చారు. పాకిస్తాన్ రిజిస్ట్రేషన్ తో కొత్త నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసారు. అయితే అధికారులు కారు చాసిస్ నెంబర్ పరిశీలించి నిర్దారణ చేసుకున్నారు.  రిజిస్ట్రేషన్ నకిలీదని తెల్సుకున్నారు.  కారు కొన్న వ్యక్తిని విక్రియంచిన బ్రోకర్ ను కస్టడీలోకి తీసుకున్నారు.

కారును దొంగిలించిన అసలు దొంగల కోసం గాలిస్తున్నారు. తూర్పు యూరోపియన్ దేశానికి చెందిన అగ్ర దౌత్యవేత్త పత్రాలు పొది కారును ఖండాంతరాలు దాటించారు. దిగుమతి సమయంలో సుంకం కూడ ఎగవేసినట్లు విచారణలో తేలింది. కారును దొంగిలించిన దొంగలు కారులో సీక్రెట్ గా ఉన్న ట్రాకర్ ను కనుగుని దాన్ని నిర్వీర్యం చేయ లేక దొరికి పోయారు. ఈ లగ్జరీ కారును తిరిగి లండన్ కు చేర్చు యజమానికి అప్పగించనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు