రక్త దాతలకు చిరు భరోసా -ఒక్కొక్కరికి 7లక్షల భీమా


 రక్త దాణం - నేత్ర దాణాల ద్వారా సామాజిక సేవా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవి ఓ అడుగు ముందుకు వేసి దాతలకు  భరోసా నిస్తు బీమా సౌకర్యం కల్పించాడు. 50 సార్లకు రక్తదాణం చేసిన అభిమానులకు దాతలకు ఒక్కొక్కరికి 7 లక్షల భీమా సౌకర్యం కల్పించాడు.   

"ప్రతి రక్త దాన ప్రాణ దాతే. రక్తదానం అనే కార్యక్రమానికి రక్త దానం చేసే ప్రతి ఒక్కరూ ఓ అంబాసిడ‌రే. ఈ ర‌క్త‌దాత‌లు ఎంతో మంది ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తి. దీన్ని మ‌నం వ్యాప్తి చేద్దాం. ఎంతో మంది అభిమానులు ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌మైయ్యారు. నావంతుగా వారిలో రెండు వేల మందిని ‘చిరు భద్రత’  అనే కార్య‌క్ర‌మంలో జాయిన్ చేసుకున్నాను. అందులో భాగంగా ఒక్కొక్క‌రికీ రూ.7 ల‌క్ష‌లు ఇన్‌సూరెన్స్ భ‌ద్ర‌త‌ను క‌లిగి ఉంటారు. ఈ ప్రోగ్రామ్ ప్రీమియ‌ర్ ఖ‌ర్చునంతంటినీ చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ చెల్లిస్తుంది. వీరంద‌రూ 50 సార్లుకు పైగా ర‌క్త‌దానం చేసిన‌వారే" అని తెలియజేస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు.

‘చిరు భద్రత’ పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను ఆదివారం రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి దాతలకు అంద చేసి వారిని సత్కరించారు.   

ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై చిరంజీవి సేవలను మెచ్చుకున్నారు.  బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్న చిరంజీవిని అభినందించారు. రక్తదానం చేయడం చిన్న విషయం కాదన్నారు. మెగాస్టార్ తెర‌మీదే కాకుండా నిజ జీవితంలో కూడా రియ‌ల్ హీరో అని కొనియాడారు. తాను సేవ చెయ్యడమే కాకుండా ల‌క్ష‌లాదిమంది సామాజిక సేవ చేసే విధంగా ప్రేరేపించార‌ని ప్ర‌శంసించారు.  


హైదరాబాద్ లో 25 సంవత్సరాలుగా చిరంజీవి బ్లడ్ బాంకు సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు 9 లక్షల 30 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి అంద చేసారు.  రక్తాన్ని ఎక్కువ శాతం నిరుపేదలకు అంద చేస్తుంటారు.

బ్లడ్ బాంకు తో పాటు ఐ బ్యాంకు కూడ నిర్వహిస్తున్నారు. ఐ బ్యాంక్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 4,580 జ‌త‌ల క‌ళ్లు సేక‌రించారు.  వీటి ద్వారా 9,060 మంది అంధుల‌కు చూపు తెప్పించార‌ు.  


1998లో రక్తం అందుబాటులో లేక చాలా మంది చనిపోయిన ఘటనలు తనను ఎంతో బాధ పెట్టాయని, అప్పుడే బ్లడ్ బ్యాంక్ ఆలోచన వచ్చిందని చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు. తన కోసం ఏదైనా అభిమానుల ప్రేమని నలుగురికీ ఉపయోగపడేలా మార్చాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించినట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రక్తదాతలకు గవర్నర్‌ తమిళిసై చేతుల మీదుగా ‘చిరు భద్రత’ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. వీరందరూ వందలాది మంది ప్రాణాలను కాపాడారని చిరంజీవి అభినందించారు. వీరినీ, వీరి కుటుంబాలను కాపాడాల్సిన బాధత్య తనపై ఉందని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పారు. 

తరచుగా రక్తదానం చేసే 2000 మందికి 7లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. వీరందరి ఇన్సూరెన్స్ ప్రీమియం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ చెల్లింస్తుందని చెప్పారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు